తదుపరి వార్తా కథనం

SALAR : ఆకట్టుకుంటున్న సలార్ టీజర్.. ట్రైలర్ విడుదల డేట్ కూడా ఫిక్స్
వ్రాసిన వారు
TEJAVYAS BESTHA
Oct 04, 2023
11:34 am
ఈ వార్తాకథనం ఏంటి
సలార్ సినిమా నుంచి మరో అదిరిపోయే వార్త అందింది. పాన్ ఇండియా స్టార్, బాహుబలి ప్రభాస్ హీరోగా, స్టార్ హిరోయిన్ శృతి హాసన్ జోడిగా తెరకెక్కుతోన్న సలార్ మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది.
సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో రూపుదిద్దుకుంటున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ సలార్ ఎన్నో అంచనాలతో డిసెంబర్ లో విడుదలకు సిద్ధమవుతోంది.
అంతకుముందే ఈ సినిమా నుంచి ట్రైలర్ కట్ కోసం ప్రేక్షకులతో పాటు ప్రభాస్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ప్రభాస్ పుట్టినరోజు కానుకగా అక్టోబర్ 23న ట్రైలర్ రిలీజ్ కోసం నిర్మాణ బృందం ఏర్పాట్లు చేస్తున్నారు.
రవి బసృర్ అందిస్తున్న సంగీతం, సలార్ చిత్రాన్ని మరో రేంజ్ కు తీసుకెళ్లనుందని, ఈ మేరకు అంచనాలు రెట్టింపయ్యాయి.