
అమెరికాలో ఆర్ఆర్ఆర్ రికార్డును బద్దలు కొట్టనున్న సలార్: ప్రభాస్ స్టామినా గురూ
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సలార్ సినిమాపై అంచనాలు విపరీతంగా ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్ 125మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.
రెండు భాగాలుగా వస్తున్న సలార్, మొదటి భాగాన్ని సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ రికార్డును సలార్ బద్దలు కొట్టనుందని సమాచారం.
అమెరికాలోని అన్ని సినీమార్క్ థియేటర్లలో సలార్ విడుదల కానుందని యూఎస్ డిస్ట్రుబ్యూటర్ వెల్లడించారు.
ఆర్ఆర్ఆర్ సినిమా అమెరికాలో 285సినీ మార్క్ థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు అన్ని సినీమార్క్ థియేటర్లలో విడుదల కానుండడంతో ఆర్ఆర్ఆర్ రికార్డును సలార్ తిరగరాసింది.
అంతేకాదు, నార్త్ అమెరికాలో ఏకంగా 1980థియేటర్లలో సలార్ విడుదల కానుందని అంటున్నారు.
Details
చరిత్ర సృష్టించేలా కనిపిస్తున్న సలార్
ఈ లెక్కలన్నీ చూస్తుంటే సలార్ బాక్సాఫీసు విజృంభణ వేరే లెవెల్లో ఉండనుందని తెలుస్తుంది. భారతదేశ బాక్సాఫీసు చరిత్రలో కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
సలార్ సినిమా విడుదలకు ఇంకా యాభై రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో సలార్ నుండి అప్డేట్స్ రావడం మొదలవుతుంది. మరి అప్డేట్స్ ఇవ్వడం ఎప్పుడు మొదలుపెడతారో చూడాలి.
హాంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై రూపొందుతున్న సలార్ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా కనిపిస్తుంది. జగపతి బాబు, మళయాల నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, టీనూ ఆనంద్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.