Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటి ఆవరణ లో ఫైరింగ్ కేసు.. నిందితుడి ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) నివాసమైన ముంబైలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్ ఆవరణలో కాల్పుల ఘటన కేసులో నిందితుడిగా ఉన్న అనూజ్ థాపన్ (Anuj Thapan) పోలీసుల కస్టడీలో ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అతడిని ముంబైలోని జీటీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అనూజ్ థాపన్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఏప్రిల్ 14న ముంబైలోని సల్మాన్ నివసిస్తున్న గెలాక్సీ అపార్ట్‌మెంట్ ఆవరణలోకి విక్కీ గుప్తా,సాగర్ పాల్,అనూజ్ థాపన్ అనే ముగ్గురు యువకులు బైక్ పై వచ్చి కాల్పులు జరిపి పారిపోయారు. అయితే రంగంలోకి దిగిన పోలీసులు సల్మాన్ ఖాన్‌కు భారీ భద్రతను పెంచారు.
ముగ్గురు నిందితులపై మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యా
దీంతోపాటు నిందితులు పారిపోతున్న ఘటన సీసీ కెమెరాలలో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు ఈ ముగ్గురు నిందితులపై మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ ను విధించారు. అరెస్టైన ముగ్గురు నిందితులకు మే 8 వరకు పోలీస్ కస్టడీ విధించి సంగతి తెలిసిందే.