Salaar OTT: సలార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్స్.. రికార్డు ధరకు కొనుగోలు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
భారీ అంచనాల మధ్య ఇవాళ రిలీజైన సలార్(Salaar) పార్ట్ 1 పాజిటివ్ రెస్పాన్స్‌తో ముందుకెళ్తుతోంది. ప్రశాంత్ నీల్(Prashanth Neil) దర్శకత్వం ఈ సినిమాలో ప్రభాస్(Prabhas) విశ్వరూపం చూపించాడంటూ ఫ్యాన్స్ తెగ సంబరిపడిపోతున్నారు. ఇక థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ హంగామా అంత ఇంత కాదు. బహుబలి సినిమా తర్వాత ప్రభాస్‌కి సరైన హిట్ పడిందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం థియేటర్లలో సలార్ మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక తాజాగా ఓటీటీ పార్టనర్ ఎవరో తెలిసిపోయింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ప్లిక్స్ భారీ ధరలకు కొనుగోలు చేశారని తెలిసింది.
రెండు నెలల తర్వాత సలార్ స్ట్రీమింగ్
ఇక బుల్లితెరలో స్టార్ మా ఛానల్ సలార్ రైట్స్ ని సొంతం చేసుకుంది. తెలుగు టెలివిజన్ హిస్టరీలోనే దాదాపుగా రూ.22 కోట్లకు సలార్ టీవీ రైట్స్‌ని స్టార్ మా సొంతం చేసుకున్నట్లు సమాచారం. మరోవైపు నెట్ ప్లిక్స్ సంస్థ దాదాపు 300 కోట్లకు పైగా చెల్లించి మూవీ రైట్స్ ను సొంతం చేసుకుందట. సలార్ చిత్రాన్ని రెండు నెలల తర్వాతే స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.