Page Loader
Salaar Release Collection: సలార్ రీ-రిలీజ్ కలెక్షన్లు.. బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ప్రభాస్!
సలార్ రీ-రిలీజ్ కలెక్షన్లు.. బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ప్రభాస్!

Salaar Release Collection: సలార్ రీ-రిలీజ్ కలెక్షన్లు.. బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ప్రభాస్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 02, 2025
03:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రభాస్ నటించిన సలార్ మూవీ మార్చి 21న థియేటర్లలో రీ-రిలీజ్ అయ్యింది. మ్యాడ్ స్క్వేర్, రాబిన్‌హుడ్ లాంటి కొత్త సినిమాలకు పోటీగా నిలిచి, బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. రీ-రిలీజ్ ద్వారా సలార్ ఏకంగా రూ. 4.35 కోట్ల గ్రాస్‌ వసూళ్లను రాబట్టినట్లు సమాచారం. ఫస్ట్ డే రికార్డ్స్ సలార్ రీ-రిలీజ్‌ తొలి రోజునే రూ.3.20 కోట్ల వసూళ్లను రాబట్టి, తెలుగు రీ-రిలీజ్ మూవీస్‌లో ఫస్ట్ డే హయ్యెస్ట్ ఓపెనింగ్ సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. రెండో రోజు నుంచి థియేటర్లను కొంతమంది తగ్గించినా కూడా, సినిమాకు మంచి వసూళ్లు కొనసాగాయి.

Details

 తెలుగులో హయ్యెస్ట్ రీ-రిలీజ్ కలెక్షన్ 

ఓవరాల్‌గా రూ.4.35 కోట్ల గ్రాస్‌ కలెక్ట్ చేసిన సలార్, తెలుగు రీ-రిలీజ్ మూవీస్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్‌ సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఆంధ్రా రూ. 1.75 కోట్లు, నైజాం రూ. 1.70 కోట్లు, ఓవర్సీస్, ఇతర రాష్ట్రాలు కలిసి రూ. 50 లక్షలు కలెక్షన్స్ సాధించింది. సలార్‌తో రూ. 700 కోట్ల గ్రాస్ వసూలు ఈ చిత్రం 2023లో అత్యధిక తెలుగు కలెక్షన్స్‌ సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అంతేకాదు, ఇండియా వైడ్‌గా హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన ఏడో సినిమాగా కూడా రికార్డు క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించగా, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రియా రెడ్డి కీలక పాత్రలు పోషించారు.

Details

వరుస సినిమాలతో బిజీగా ప్రభాస్

సలార్ సినిమాకు సీక్వెల్‌గా 'సలార్ 2: శౌర్యంగపర్వం' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. అది పూర్తయిన తర్వాతే సలార్ 2 షూటింగ్ మొదలుకానుంది. ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్, ఫౌజీ వంటి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.