Salman khan: గల్వాన్ కథతో సల్మాన్ సినిమా.. టైటిల్ ఫిక్స్
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' చిత్రానికి సంబంధించిన పేరులో తాజాగా మార్పు చేశారు. కొత్తగా ఈ చిత్రాన్ని 'మాతృభూమి (Maatrubhumi: May War Rest in Peace)' అనే పేరుతో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొత్త టైటిల్‌తో రూపొందించిన పోస్టర్‌ను సల్మాన్ ఖాన్ తన 'ఎక్స్' ఖాతాలో పంచుకున్నారు. అయితే సినిమా పేరును ఎందుకు మార్చారన్న విషయంపై మాత్రం ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
వివరాలు
కర్నల్ పాత్రలో సల్మాన్
దాదాపు ఆరు సంవత్సరాల క్రితం జరిగిన గల్వాన్ లోయలోని ఘర్షణలను నేపథ్యంగా తీసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ భారత సైన్యానికి చెందిన కర్నల్ సంతోష్‌బాబు పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌కు అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్‌గా చిత్రాంగద సింగ్ నటిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో సల్మాన్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేయగా, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.
వివరాలు
విడుదల ఎప్పుడంటే..
మొదటగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 17న విడుదల చేయాలని వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు పేరు మార్పు నేపథ్యంలో సినిమా విడుదల మరికొంత ఆలస్యమయ్యే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.