Salmankhan: సల్మాన్ ఖాన్‌కు మళ్లీ బెదిరింపులు.. ఈసారి షూటింగ్ సెట్ లో..
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు ఎదురయ్యాయి. బుధవారం రాత్రి ముంబైలోని దాదర్ ప్రాంతంలో సల్మాన్ సినిమా షూటింగ్‌లో ఉండగా, ఓ వ్యక్తి సెట్లోకి ప్రవేశించి, గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరును ప్రస్తావిస్తూ బెదిరింపు బెదిరింపు ధోరణిలో మాట్లాడాడు. అతడిని షూటింగ్‌లో ఉన్న ఇతర సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి అతడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం శివాజీ పార్కు పోలీసులు అతడిని విచారిస్తున్నారు. గతంలో సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడిన కేసులో దోషిగా తేలిన విషయం తెలిసిందే. ఈ కారణంగా లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ నుంచి సల్మాన్‌కు అనేక హెచ్చరికలు అందాయి.