Loading...
Viral Look: గుర్తుపట్టలేనంతగా మారిన సల్మాన్ ఖాన్.. 'భాయ్‌జాన్' లుక్‌పై అభిమానుల్లో ఆందోళన
గుర్తుపట్టలేనంతగా మారిన సల్మాన్ ఖాన్.. 'భాయ్‌జాన్' లుక్‌పై అభిమానుల్లో ఆందోళన

Viral Look: గుర్తుపట్టలేనంతగా మారిన సల్మాన్ ఖాన్.. 'భాయ్‌జాన్' లుక్‌పై అభిమానుల్లో ఆందోళన

వ్రాసిన వారు Moogati Shabari
Jul 19, 2026
05:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ స్టార్ హీరో, 'భాయ్‌జాన్'గా అభిమానుల మన్ననలు పొందిన సల్మాన్ ఖాన్ తాజా రూపం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు కారణమైంది. ఇటీవల ముంబైలో నిర్వహించిన ఓ ఈవెంట్‌లో ఆయన తలకు క్యాప్ ధరించి కనిపించారు. అయితే ఆ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ కావడంతో సల్మాన్ ఖాన్ లుక్‌పై అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కనిపించిన ఉత్సాహం, స్టైలిష్ లుక్‌తో పోలిస్తే ఈసారి ఆయన కాస్త నీరసంగా, వయసు ప్రభావం స్పష్టంగా కనిపించేలా ఉన్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

వివరాలు

సల్మాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన..

ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కొందరు ఇది వయసు పెరగడం వల్ల వచ్చిన సహజ మార్పు అని వ్యాఖ్యానిస్తుంటే, మరికొందరు కొత్త సినిమా కోసం ప్రత్యేక మేకోవర్‌లో భాగంగానే ఈ లుక్ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

మరోవైపు, కొంతమంది అభిమానులు మాత్రం సల్మాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

వివరాలు

షాక్ అవుతున్న అభిమానులు..

అయితే ఈ లుక్ వెనుక అసలు కారణంపై ఇప్పటివరకు సల్మాన్ ఖాన్ గానీ, ఆయన ప్రతినిధుల బృందం గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ప్రస్తుతం ఆయన చేతిలో పలు భారీ చిత్రాలు ఉండగా, దాదాపు మూడు దశాబ్దాలుగా ఫిట్‌నెస్, స్టైలిష్ వ్యక్తిత్వం, సిక్స్‌ప్యాక్ బాడీతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సల్మాన్ ఖాన్‌ను ఈ విధంగా చూడటం అభిమానులను ఒకవైపు ఆశ్చర్యానికి, మరోవైపు ఆందోళనకు గురిచేస్తోంది.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న పోస్ట్..

ADVERTISEMENT