LOADING...
Salman Khan: సల్మాన్ - నయనతార కాంబో ఫిక్స్..? దిల్ రాజు భారీ ప్లాన్!
సల్మాన్ - నయనతార కాంబో ఫిక్స్..? దిల్ రాజు భారీ ప్లాన్!

Salman Khan: సల్మాన్ - నయనతార కాంబో ఫిక్స్..? దిల్ రాజు భారీ ప్లాన్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 29, 2026
10:11 am

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ 2026 ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తన వార్ డ్రామా 'మాతృభూమి' (మునుపటి పేరు 'బ్యాటిల్ ఆఫ్ గాల్వన్') పనుల్లో బిజీగా ఉండగా, అది పూర్తయిన వెంటనే వంశీ పైడిపల్లి సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను 2026 చివరికల్లా పూర్తి చేసి, 2027 ఈద్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమా కోసం సల్మాన్ ఖాన్ తొలిసారిగా ప్రాఫిట్ షేరింగ్ మోడల్‌లో పని చేయడం ప్రత్యేకంగా నిలిచింది.

వివరాలు

కీలక పాత్రలో అనిల్ కపూర్

ఇక తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా మరింత భారీ స్థాయికి చేరుకుంది. ఇందులో సల్మాన్ సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. 'జవాన్'తో బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన నయనతార, ఇప్పుడు సల్మాన్ ఖాన్‌తో తొలిసారి జోడీ కడుతుండటంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. సీనియర్ నటుడు అనిల్ కపూర్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నారనే వార్త ప్రాజెక్ట్‌పై మరింత హైప్‌ను తీసుకొచ్చింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

వివరాలు

వంశీ పైడిపల్లికి తొలి బాలీవుడ్  చిత్రం 

ఈ సినిమా వంశీ పైడిపల్లికి బాలీవుడ్‌లో తొలి చిత్రం కావడం విశేషం. ఇక నయనతార ప్రస్తుతం యష్ నటిస్తున్న 'టాక్సిక్'లో నటిస్తూనే, ఈ బాలీవుడ్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. సౌత్ డైరెక్టర్, ప్రముఖ నిర్మాత, బాలీవుడ్ స్టార్ కలయికలో రూపొందుతున్న ఈ భారీ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Advertisement