Page Loader
ఓటీటీలో సామజవరగమన సినిమాకు తిరుగులేని రెస్పాన్స్: ఏకంగా 200మిలియన్లను దాటేసింది 
ఓటీటీలో రికార్డులు సృష్టిస్తున్న సామజవరగమన

ఓటీటీలో సామజవరగమన సినిమాకు తిరుగులేని రెస్పాన్స్: ఏకంగా 200మిలియన్లను దాటేసింది 

వ్రాసిన వారు Sriram Pranateja
Aug 01, 2023
04:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన సినిమాల్లో సామజవరగమన ఒకటి. శ్రీవిష్ణు కెరీర్లో అత్యధిక వసూళ్ళు(50కోట్లకు పైగా) సాధించడమే కాకుండా అమెరికాలో వన్ మిలియన్ డాలర్ వసూళ్ళను సామజవరగమన సాధించింది. రెబా మోనికా జాన్ హీరోయిన్ గా కనిపించిన ఈ సినిమా, ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తుంది. థియేటర్లలో ఎలాగైతే దుమ్ము దులిపిందో ఓటీటీలోనూ తిరుగులేని రికార్డులను నమోదు చేస్తుంది. జులై 27న ఆహాలోకి వచ్చిన సామజవరగమన సినిమాకు గడిచిన 72గంటల్లో 200మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ వచ్చాయి. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాను చూడటానికి ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు. సామజవరగమన సినిమాలో నరేష్, శ్రీవిష్ణు మధ్య వచ్చే కామెడీ సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి.

Details

40గంటల్లో 100మిలియన్లు 

సామజవరగమన చిత్రాన్ని ముందుగా జులై 28వ తేదీన ఓటీటీలో విడుదల చేస్తామని ఆహా ప్రకటించింది. కానీ ప్రేక్షకుల డిమాండ్ మేరకు ఒకరోజు ముందుగానే జులై 27వ తేదీన సామంత్రం 7గంటల నుండి అందుబాటులో ఉంచింది. ఆహాలో రిలీజ్ అయినప్పటి నుండి రికార్డులు తిరగరాస్తూనే ఉంది. 40గంటల్లో 100మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ తెచ్చుకుంది. ఇప్పుడు అంతకంటే తక్కువ టైమ్ లో మరో 100మిలియన్ల స్ట్రీమింగ్ వ్యూస్ తెచ్చుకుంది. హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా నిర్మాతగా రూపొందిన ఈ సినిమాను రామ్ అబ్బరాజు తెరకెక్కించారు. శ్రీకాంత్ అయ్యంగార్, రాజీవ్ కనకాల, సుదర్శన్, వెన్నల కిషోర్ కీలక పాత్రల్లో నటించారు.