Samantha Ruth Prabhu : సమంత పేరు మార్పు: మా ఇంటి బంగారం సినిమాతో మొదలు..
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత, బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ రాజ్ నిడిమోరు గత ఏడాది డిసెంబర్ 1న వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో అత్యంత సన్నిహితులు మధ్య వీరి వివాహం జరిగింది. అప్పటి నుంచి వీరు పర్సనల్ లైఫ్‌తో పాటు ప్రొఫెషనల్ లైఫ్‌లో కూడా ఎంతో యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. తాజాగా సమంత తీసుకున్న ఒక నిర్ణయం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
వివరాలు
మరోసారి ఇంటి పేరు మార్చుకోనున్న సమంత
సమంత తన ఇంటి పేరును మరోసారి మార్చుకోబోతుంది. సాధారణంగా పెళ్లి తర్వాత చాలా మంది తమ పేర్లలో భర్త పేరును చేర్చుతారు. సమంత కూడా మొదట అక్కినేని నాగచైతన్యతో వివాహం తరువాత తన పేరును 'సమంత అక్కినేని'గా మార్చుకుంది. కానీ విడాకుల తర్వాత మళ్లీ 'సమంత రూత్ ప్రభు'గా మార్చుకుంది. ఇప్పుడు రాజ్ నిడిమోరుతో కొత్త జీవితాన్ని ప్రారంభించడంతో, భర్త పేరును తన పేరు చివర చేర్చాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఆమె ఇప్పుడు 'సమంత నిడిమోరు'గా మార్చుకుంది.
వివరాలు
'సమంత నిడిమోరు'
సమంత ప్రస్తుతం నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్టైనర్ 'మా ఇంటి బంగారం'. ఈ సినిమాకి నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, రాజ్ నిడిమోరు క్రియేటర్, సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో టైటిల్ కార్డ్స్‌లోనే ఆమె పేరును 'సమంత నిడిమోరు'గా ప్రదర్శించనున్నారు అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. సమంత ఈ సినిమా ద్వారా తన కొత్త పేరును ప్రపంచానికి పరిచయం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.. మొత్తానికి భర్తపై తన ప్రేమను చూపుతూ, తన పేరు మార్చుకున్న సమంత నిర్ణయంపై ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.