Samantha: సినీ కెరీర్‌లో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సమంత.. ఫ్యాన్స్‌కు స్పెషల్ గిఫ్ట్?
ఈ వార్తాకథనం ఏంటి
ఇండస్ట్రీలో 'కుందనపు బొమ్మ'గా పేరు తెచ్చుకున్న జెస్సీ అలియాస్ సమంత.. ఇప్పటికి తన సినీ ప్రస్థానంలో 15 ఏళ్లు పూర్తి చేసుకుంది.
వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న సామ్.. మునుపటి ఫామ్‌ను తిరిగి అందుకోవడానికి కృషి చేస్తోంది. విజయ్ దేవరకొండతో చేసిన 'ఖుషీ' సినిమా తర్వాత వెండితెరపై కనిపించని సమంత.. తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉంది.
అయితే రీసెంట్‌గా అభిమానులు టాలీవుడ్‌లో మళ్లీ అడుగుపెట్టాలంటూ విజ్ఞప్తి చేయగా.. "వచ్చేస్తున్నా బ్రో" అంటూ సమంత స్పందించింది. ఈ ఒక్క మాటే ఆమె ఫ్యాన్స్‌కు గట్టి బూస్ట్ ఇచ్చింది.
Details
సుకుమార్ సినిమాలో సమంత
సమంత కామెంట్‌తో టాలీవుడ్ సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
ఇటీవల నందిని రెడ్డి బర్త్‌డే సందర్భంగా, సమంత ఆమెకు విషెస్ చెప్పడం కొత్త రూమర్లకు దారితీసింది.
వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపించగా.. దీనిపై స్పందించిన నందిని రెడ్డి, "ఇది కేవలం రూమర్ మాత్రమే.. మరోసారి మంచి గాసిప్స్ క్రియేట్ చేయండి అంటూ క్లారిటీ ఇచ్చింది.
అంతేకాకుండా రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్‌లో రాబోయే సినిమాలో సమంత నటించబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ బలంగా వినిపిస్తోంది.
అయితే దీనిపై ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక సమాచారం లేదు.
Details
త్వరలోనే కొత్త మూవీ అనౌన్స్‌మెంట్?
మరోవైపు సమంత గతేడాది తన సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి, 'మా ఇంటి బంగారం' అనే సినిమాను అనౌన్స్ చేసింది.
కానీ ఈ ప్రాజెక్ట్ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు.
సినిమా నిజంగా ఉంది? లేదంటే ఆగిపోయిందా? అనే డౌట్స్ అభిమానుల్లో పెరుగుతున్నాయి.
ఇప్పుడేమైతే టాలీవుడ్ రీ ఎంట్రీ ప్రకటించిన సమంత.. త్వరలోనే కొత్త తెలుగు మూవీ అనౌన్స్‌మెంట్ ఇవ్వబోతున్నట్లు అందరిలో ఆసక్తి పెరిగింది.
మరి సామ్ నుండి ఈ తీపి కబురు ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి!