Page Loader
సమంత యూరప్ పర్యటన: మోండ్సీ సరస్సు వద్ద కూర్చుని ఎమోషనల్ అయిన ఖుషి భామ 
యూరప్ పర్యటనలో ఉన్న సమంత

సమంత యూరప్ పర్యటన: మోండ్సీ సరస్సు వద్ద కూర్చుని ఎమోషనల్ అయిన ఖుషి భామ 

వ్రాసిన వారు Sriram Pranateja
Sep 25, 2023
03:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఖుషి హీరోయిన్ సమంత, ప్రస్తుతం యూరప్ లో ఉంది. అమెరికాలో మయోసైటిస్ గురించి చికిత్స తీసుకుంటూ ప్రపంచాన్ని చుట్టేస్తోంది. మొన్నటివరకు న్యూయార్క్ నగరంలో చక్కర్లు కొట్టిన సమంత, ప్రస్తుతం యూరప్ ఖండంలో ఆస్ట్రియాకు చేరుకుంది. ఆస్ట్రియాలో సెల్జ్ బర్గ్ నగరంలో మోండ్సీ సరస్సు వద్ద కూర్చుని ఎమోషనల్ అయ్యింది సమంత. చిన్నప్పటి నుండి తనకు బాధ వచ్చినా, సంతోషం వచ్చినా ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్ చూసేదాన్ననీ, ఆ సినిమా చూస్తున్నంత సేపు కొత్త ప్రపంచంలోకి వెళ్ళేదాన్ననీ అంది. కొన్ని సినిమాలు చూస్తున్నా కొద్దీ ఇంకా బాగా అనిపిస్తాయనీ, అలాంటి వాటిలో ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్ ఒకటనీ, ఆ సినిమాలోని చాలా సన్నివేశాలు మోండ్సీ సరస్సు వద్ద చిత్రీకరించారని సమంత అన్నారు.

ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయండి

సమంత ఇన్స్ టా పోస్ట్