
Samantha: ఏడాదిలో 15 బ్రాండ్స్ వదులుకున్న సమంత.. ఎందుకంటే?
ఈ వార్తాకథనం ఏంటి
తన ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇస్తూ నటి 'సమంత' గత కొంతకాలంగా జీవనశైలిని పూర్తిగా మార్చేసింది.
సెల్ఫ్ లవ్, మహిళా సాధికారత, వ్యక్తిగత సంరక్షణ వంటి విషయాల్లో స్పష్టమైన అభిప్రాయాలతో తన అభిరుచులకు అనుగుణంగా జీవిస్తూ.. ఆమె ఇన్‌స్టాగ్రామ్ వంటి వేదికల్లో తరచూ సందేశాలు ఇస్తుంటారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత, మానసిక ఆరోగ్యం, బ్రాండింగ్ ప్రకటనలు వంటి అంశాలపై స్పందించారు.
అంతలోనే ఒక్క హైలైట్
తాను కోట్లల్లో రూపాయలు వస్తున్నా గత ఏడాదిలో సుమారు 15 బ్రాండ్స్‌ను వదులుకున్నట్లు వెల్లడించారు. వాటిని వదిలేందుకు ఆమె చెప్పిన కారణం చాలామందికి స్ఫూర్తిదాయకం.
Details
అంతర్జాతీయ బ్రాండ్లకు ప్రచారకర్తగా
ఇరవై ఏళ్ల వయసులో సినిమాల్లోకి వచ్చాను. అప్పట్లో విజయానికి అర్థం.. ఎన్ని సినిమాలు చేశాం, ఎన్ని బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉన్నామన్నదే. ఆ సమయంలో అనేక అంతర్జాతీయ బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్నాను.
కానీ ఇప్పుడు బాధ్యతతో బ్రాండ్‌లు ఎంచుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాను. గతంలో చేసిన కొన్ని బ్రాండ్‌ల ఎంపికలపై నేనే క్షమాపణ చెబుతున్నాను.
ఇప్పుడు ఏ ఉత్పత్తినైనా ముందుగా నాకు తెలిసిన ముగ్గురు వైద్యులతో పరీక్షించిస్తాను. హాని కలిగించే అవకాశం లేదని నిర్ధారించిన తర్వాతే వాటిని ఆమోదిస్తానని సమంత వివరించారు.
Details
ఆరోగ్యం పై సమంత స్పష్టత
తాను మయోసైటిస్ అనే ఆటోఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్నట్లు గతంలోనే ప్రకటించిన సమంత, చికిత్స తీసుకుంటూనే షూటింగ్స్ చేశానని పేర్కొన్నారు. "అది ఓ తీవ్రమైన అనుభవం.. కానీ ఇప్పుడు బలంగా ఉన్నానని చెప్పుకొచ్చారు.
సమంత ప్రస్తుతం 'సిటడెల్: హనీ బన్నీ' తర్వాత 'రక్త్ బ్రహ్మాండ్' అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారు.
ఈ సినిమాకు రాహి అనిల్ బార్వే దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే 'మా ఇంటి బంగారం' అనే చిత్రంలో నటించనున్నట్లు వెల్లడించారు.
ఇక ఆమె నిర్మాతగా వ్యవహరించిన 'శుభం' సినిమా త్వరలోనే విడుదల కానుంది.