
Samantha:హెల్త్ ఫోకస్డ్ పాడ్‌కాస్ట్‌లను అందుకే నిర్వహిస్తున్న: సమంత
ఈ వార్తాకథనం ఏంటి
అగ్రనటిగా గుర్తింపు పొందిన సమంత, మయోసైటిస్‌తో చేసిన పోరాటం తనకు ఎన్నో జీవిత పాఠాలు నేర్పిందని అన్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు ఆమెలో వ్యక్తిత్వంలో, ఆలోచనల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. ఇటీవల దిల్లీలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న సమంత, మయోసైటిస్ కారణంగా జీవితంలో ఏ విషయానికి ప్రాధాన్యం ఇవ్వాలో గుర్తించానని చెప్పింది. ఆ వ్యక్తిగత పోరాటం తనలో గొప్ప మార్పులు తీసుకువచ్చిందని స్పష్టం చేశారు.
వివరాలు
చాల మంది నన్ను సినిమాల కారణంగా ఫాలో అవుతున్నారని తెలిసింది: సమంత
"గతంలో నేను ఎప్పుడూ భయంతో ఉండేదాన్ని. ప్రతి శుక్రవారం నా మనసులో ఒక ఆందోళన ఉండేది. 'రేపు ఇండస్ట్రీలో ఎవరో నా స్థానాన్ని భర్తీ చేస్తారేమో?' అనే ఆలోచనతో బాక్సాఫీస్ ఫలితాలను, నంబర్లను అంచనా వేయడానికి ప్రయత్నించేదానని గుర్తు చేసుకుంటున్నాను. నా ఆత్మగౌరవం అంతా ఆ ఫలితాలపై ఆధారపడి ఉందనుకునేదాన్ని.ఇప్పుడు అలా ఆలోచించడం లేదు.నా ఫాలోవర్స్ చాలా మంది నన్ను నా గ్లామర్, సినిమాల కారణంగా ఫాలో అవుతున్నారని తెలిసింది. అందువల్ల, వారికోసం నేను గత ఏడాది నుండి హెల్త్ ఫోకస్డ్ పాడ్‌కాస్ట్‌లు నిర్వహించడం ప్రారంభించాను. ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం కోసం ఎక్కడో వెతకాల్సిన అవసరం ఉండకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాను" అని సమంత తెలిపారు.
వివరాలు
ది బ్లడీ కింగ్‌డమ్ లో సమంత
ప్రస్తుతం సమంత 'రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్' (Rakht Brahmand: The Bloody Kingdom) చిత్రంలో నటిస్తున్నారు. రాజ్ & డీకే (Raj & DK) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సమంత, ఆదిత్యరాయ్ కపూర్, అలీ ఫజల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇది పీరియాడిక్ డ్రామాగా రూపకల్పన చేయబడిన చిత్రం.