Naga Chatanya - Samantha : నా కెరీర్‌కు పునాది వేసిన సినిమా అదే.. 'ఏ మాయ చేసావే'పై సమంత స్పందన
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం సమంత నటించిన 'మా ఇంటి బంగారం' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో ఆమె చురుకుగా పాల్గొంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇంటర్వ్యూలో భాగంగా సమంతను ఆమె కెరీర్‌లోని పలు చిత్రాలను పోల్చుతూ, వాటిలో తనకు అత్యంత ఇష్టమైన సినిమాలను ఎంపిక చేయమని అడిగారు. అందుకు స్పందించిన ఆమె 'ఏ మాయ చేసావే', 'ఈగ' చిత్రాల్లో 'ఏ మాయ చేసావే'ని ఎంచుకుంది.
వివరాలు
జీవితాన్నే మార్చేసిన సినిమా..
అలాగే 'ఓ బేబీ' - 'అఆ' చిత్రాల్లో 'ఓ బేబీ', 'యశోద' - 'రంగస్థలం' చిత్రాల్లో 'రంగస్థలం', 'సిటాడెల్' - 'ఫ్యామిలీ మ్యాన్' మధ్య 'ఫ్యామిలీ మ్యాన్'ను ఎంపిక చేసింది. అనంతరం 'ఫ్యామిలీ మ్యాన్', 'మా ఇంటి బంగారం' మధ్య 'మా ఇంటి బంగారం'ని చెప్పింది. చివరగా 'మా ఇంటి బంగారం' మరియు 'ఏ మాయ చేసావే' చిత్రాల్లో ఒకదాన్ని ఎంచుకోవాలని అడగగా, ఎలాంటి సందేహం లేకుండా 'ఏ మాయ చేసావే' పేరును పేర్కొంది. ఈ సందర్భంగా ఆ సినిమా తన జీవితంలో ఎంత ముఖ్యమో వివరిస్తూ భావోద్వేగ వ్యాఖ్యలు చేసింది.
వివరాలు
సినీ ప్రయాణం సాగిందిలా..
సమంత మాట్లాడుతూ, 'ఏ మాయ చేసావే' లేకపోతే తన సినీ ప్రయాణమే ఉండేది కాదని తెలిపింది. అదే తన తొలి చిత్రం కావడంతో ఆ సినిమా విజయం తనకు ఎంతో కీలకమైందని చెప్పింది. ఒకవేళ తొలి సినిమాకు ఆశించిన స్థాయిలో స్పందన రాకపోయి ఉంటే, తర్వాత అవకాశాలు రావడం కష్టమయ్యేదని పేర్కొంది. అందుకే తన కెరీర్‌లో అత్యంత ప్రత్యేక స్థానం ఆ చిత్రానిదేనని స్పష్టం చేసింది. 'ఏ మాయ చేసావే' సమంతకు తొలి సినిమా కాగా, అందులో హీరోగా నటించిన నాగ చైతన్యకు అది రెండో చిత్రం. ఈ సినిమాతో మొదటిసారి జంటగా కనిపించిన నాగ చైతన్య, సమంత ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది.