
Samantha : నిర్మాతగా సమంతకు బడా నిర్మాణ సంస్థలు సపోర్ట్.. 'శుభం'పై భారీ అంచనాలు!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు, గౌరవం ఉంది. గతంలో ఆమె అనేక ప్రముఖ నిర్మాణ సంస్థలతో కలిసి పనిచేయడంతో, వారందరితో సమంతకు మంచి సంబంధాలేర్పడ్డాయి.
ప్రస్తుతం సమంత సినిమాల్లో నటించకపోయినా, ఆ బాంధవ్యాలు అలాగే కొనసాగుతున్నాయి. అందుకే ఆమె నిర్మాతగా మారి తీసిన తొలి చిత్రం 'శుభం'కు ప్రస్తుతం బడా నిర్మాణ సంస్థలే అండగా నిలుస్తున్నాయి.
ఈ సినిమాకు సుమారు ఏడు కోట్లు కాగా, ఇప్పటికే ఈ చిత్రం బిజినెస్ పరంగా మంచి లాభాలను తెచ్చిందని సమాచారం. ఇప్పటికే మూడు కోట్ల వరకు లాభాలు వచ్చాయని చెబుతున్నారు.
ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ విషయంలోనూ అగ్ర నిర్మాణ సంస్థలు స్వయంగా రంగంలోకి దిగాయి.
Details
డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు తీసుకున్న ప్రముఖ నిర్మాత సురేష్ బాబు
సాధారణంగా పెద్ద నిర్మాణ సంస్థలు చిన్న సినిమాలకు మద్దతు ఇవ్వడం అరుదుగా కనిపిస్తుంది. కానీ సమంత కోసం మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నైజాం డిస్ట్రిబ్యూషన్ బాధ్యతను తీసుకుంది.
దీనికిగాను సమంతకు సుమారు కోటిన్నర వరకు చెల్లించినట్టు తెలుస్తోంది. ఇక ఉత్తరాంధ్ర, సీడెడ్ ఏరియాల్లో డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తీసుకున్నట్టు సమాచారం.
ఆ రెండు ప్రాంతాల్లో తాను స్వయంగా పబ్లిష్ చేయిస్తానని ఆయన వెల్లడించారని అంటున్నారు. ఇలా ఒక చిన్న చిత్రానికి బడా నిర్మాణ సంస్థల మద్దతు లభించడంతో సమంతకు భరోసా పెరిగింది.
ఇప్పటికే ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటంతో, ఇది హిట్ అయితే సమంత మరిన్ని చిన్న సినిమాలను నిర్మించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు భావిస్తున్నారు.