LOADING...
Samantha: రాష్ట్రపతి విందులో సమంత సందడి.. 'కలలో కూడా ఊహించలేదు' అంటూ భావోద్వేగ పోస్ట్
https://pbs.twimg.com/media/G_qaRcKaUAAfxCE?format=jpg&name=large

Samantha: రాష్ట్రపతి విందులో సమంత సందడి.. 'కలలో కూడా ఊహించలేదు' అంటూ భావోద్వేగ పోస్ట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 27, 2026
05:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ నటి సమంతకు అరుదైన గౌరవం లభించింది. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన ప్రతిష్ఠాత్మక 'ఎట్ హోమ్' విందుకు ఆమె ఆహ్వానితులయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం సమంత తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తూ భావోద్వేగభరితమైన పోస్ట్‌ను పంచుకున్నారు. తన కెరీర్‌లో ఇలాంటి రోజు వస్తుందని కలలో కూడా ఊహించలేదని సమంత పేర్కొన్నారు. ఇది తన అదృష్టం వల్లనే కాదు, మాతృభూమి ఇచ్చిన అవకాశాలు, గుర్తింపుల వల్లే సాధ్యమైందని ఆమె అన్నారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించిన సమంత, "నా ఎదుగుదల దశలో నన్ను ప్రోత్సహించేవారు ఎవరూ లేరు.

Details

లేత పచ్చరంగు చీరతో మెరిసిన సమంత

ఒక రోజు ఇలాంటి వేదికపై నిలుస్తానని నా అంతరాత్మ కూడా చెప్పలేదు. ఎలాంటి దారి కనిపించలేదు. అలాంటి కలలు కనడానికి కూడా అప్పట్లో సాహసించలేదు. కానీ నా పని నేను నిబద్ధతతో చేస్తూ ముందుకు సాగాను. చివరకు ఈ దేశం నా కృషికి తగిన గుర్తింపు ఇచ్చింది. దీనికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని రాసుకొచ్చారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి సమంత లేత పచ్చరంగు చీరలో, బంగారు అంచులతో సంప్రదాయబద్ధంగా హాజరయ్యారు. బంగారు చోకర్ నెక్లెస్, చెవిపోగులతో తేలికపాటి మేకప్‌లో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Details

ట్రైలర్ కు విశేష స్పందన

రాష్ట్రపతి భవన్‌లో దిగిన పలు ఫొటోలు, అలాగే విందుకు సంబంధించిన ఆహ్వాన పత్రాన్ని కూడా సమంత తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఈ 'ఎట్ హోమ్' విందుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సమంత కెరీర్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఆమె 'మా ఇంటి బంగారం' అనే చిత్రంలో నటిస్తున్నారు. బి.వి. నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సమంత తన సొంత బ్యానర్ 'ట్రలాలా మూవింగ్ పిక్చర్స్'పై నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

Advertisement