
Samantha: 'రాహుల్ రవీంద్రన్‌తో ఆ అనుబంధం వేరు'.. కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సమంత
ఈ వార్తాకథనం ఏంటి
ఒకే ఒక్క అంశం ఆధారంగా కెరీర్ నిర్ణయించడం సాధ్యపడదని సమంత అన్నారు.
తాజాగా కోలీవుడ్‌లో జరిగిన గోల్డెన్ క్వీన్ అవార్డుల కార్యక్రమంలో ప్రముఖ నటి సమంత గోల్డెన్ క్వీన్ పురస్కారాన్ని అందుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె తన సినీ ప్రయాణం, వ్యక్తిగత అనుభవాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
దర్శకుడు,నటుడు రాహుల్ రవీంద్రన్‌తో తన బంధాన్ని ప్రస్తావిస్తూ, ఆయన తనకు అండగా నిలిచిన సందర్భాలను గుర్తు చేశారు.
వివరాలు
రాహుల్ నన్ను అన్నివేళలా అర్థం చేసుకున్నాడు: సమంత
"నాకు ఆరోగ్య సమస్యలు వచ్చిన సమయంలో, రాహుల్ నన్ను వదలకుండా నా పక్కనే ఉండేవాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ నన్ను జాగ్రత్తగా చూసుకునేవాడు. మా మధ్య ఉన్న బంధానికి స్పష్టమైన నిర్వచనం చెప్పలేను. అతను నా మిత్రుడా? సోదరుడా? కుటుంబసభ్యుడా? లేక రక్త సంబంధిత వాడా? అన్నదే స్పష్టంగా చెప్పలేను," అని ఆమె అన్నారు.
వివరాలు
అభిమానుల ప్రేమ దేవునిచ్చిన వరం
అభిమానుల గురించి ఆమె మాట్లాడుతూ, "ఇంతమంది అభిమానులను సంపాదించగలగటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ స్థాయికి రావడంలో నా అదృష్టంతో పాటు, నేను పెట్టిన శ్రమ కూడా ప్రధాన కారణం. ఈ ప్రేమను దేవునిచ్చిన వరంగా చూస్తాను. మనం తీసుకునే ఒక్క నిర్ణయంతో మన కెరీర్ ఏదైనా స్థిరపడుతుందన్న భావన తప్పుడు అంచనా. ఎన్నో నిర్ణయాలు.. అవి తెలిసి తీసుకున్నవైనా, తెలియక తీసుకున్నవైనా.. మన కెరీర్‌పై ప్రభావం చూపుతుంటాయి," అని వివరించారు.
వివరాలు
సమంతతో సినిమా చేయడం నా లక్ష్యం: సుధ కొంగర
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ దర్శకురాలు సుధ కొంగర సమంతపై ప్రశంసల వర్షం కురిపించారు.
"సమంత నా అభిమాన నటి. గత ఐదేళ్లుగా ఆమెను దగ్గరగా గమనిస్తున్నాను. ఆమె బాధపడినప్పుడు నాకు కన్నీళ్లు వస్తుండేవి. ఆమెను చూసి ఎంతోమంది యువతులు ప్రేరణ పొందాలి. గతంలో ఆమెతో సినిమా తీయాలని రెండు సార్లు ప్రయత్నించాను. అయితే కొన్ని కారణాల వల్ల సాధ్యపడలేదు. కానీ భవిష్యత్తులో ఆమెతో కచ్చితంగా సినిమా తీయాలని నా సంకల్పం. ప్రత్యేకంగా చెప్పాలంటే, ఆమె నటించిన 'ఊ అంటావా..' పాట నాకు చాలా ఇష్టం," అని చెప్పారు.
వివరాలు
సమంత-సుధ కలయికలో యాక్షన్ మూవీ?
ఈ మాటలపై సమంత స్పందిస్తూ, "నాకు యాక్షన్ ఫిల్మ్ చేయాలనే ఆసక్తి ఉందన్నారు. తప్పకుండా మనం ఒక యాక్షన్ ఫిల్మ్ చేద్దాం అంటూ సుధ కొంగర హామీ ఇచ్చారు.