
Samantha - Raj: మరోసారి అడ్డంగా బుక్కైన సమంత,రాజ్.. ఏకంగా ఒకే కారులో..
ఈ వార్తాకథనం ఏంటి
కొంతకాలంగా నటి సమంత,బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ ఇద్దరూ తరచూ కలిసి సెలవుల సమయంలో ప్రయాణాలు చేయడాన్ని చూసి ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది. తాజాగా,ఈ జంట మళ్లీ మీడియా కంటపడింది.ఒకే కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఫొటోగ్రాఫర్లు వీరిద్దరినీ క్లిక్ చేయగా,ఆ ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. ఈ మధ్యనే వారు ఓ ప్రముఖ రెస్టారెంట్‌కి డిన్నర్ కోసం కలిసి వెళ్లినట్టు సమాచారం. అక్కడ సమంత తెల్లని క్యాజువల్ డ్రెస్‌లో చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. డిన్నర్ అనంతరం మరోసారి ఒకే వాహనంలో వెళ్లిపోవడం,ఇద్దరి మధ్య ప్రత్యేక సంబంధం ఉందన్న ఊహాగానాలకు మరోసారి ఊతమిచ్చింది.
వివరాలు
వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు
దీంతో మరోసారి వీరి పేర్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రాజ్-డీకే దర్శకత్వంలో రూపొందిన 'ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2','సిటడెల్: హనీ బన్నీ' వెబ్ సిరీస్‌లలో సమంత ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ ప్రాజెక్టుల సమయంలోనే ఆమెకు రాజ్‌తో సన్నిహిత పరిచయం ఏర్పడినట్టు భావిస్తున్నారు. అప్పటినుంచి వీరిద్దరూ వ్యక్తిగతంగా కూడా సమయం గడుపుతున్నారన్న వార్తలు వెలువడుతున్నాయి. అయితే, ఈ వార్తలపై ఇప్పటి వరకు రాజ్ గానీ, సమంత గానీ ఎలాంటి అధికారిక వ్యాఖ్యలు చేయలేదు. ఇదిలా ఉండగా, ఇటీవల వీరిద్దరూ కలిసి వెకేషన్‌కి వెళ్లిన ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. అవి కూడా అప్పట్లో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.