
Samantha: సమంత పోస్ట్ వైరల్.. 2025లో ప్రేమ, పిల్లలంటూ..!
ఈ వార్తాకథనం ఏంటి
సినీ నటి సమంత తాజా పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తన రాశి గురించి 2025 సంవత్సరానికి సంబంధించిన అంచనాలను వివరిస్తూ, సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సందేశం షేర్ చేశారు.
ఈ సందేశంలో వృషభ, కన్య, మకర రాశి వారు 2025లో అత్యంత విజయవంతంగా ఉంటారని, వారు కొన్ని ముఖ్యమైన విషయాలను సాధించగలిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ ఏడాది మొత్తం బిజీగా ఉంటూ, వృత్తి పరంగా మెరుగుదల సాధిస్తారని పేర్కొంది. ముఖ్యంగా ప్రేమ, నమ్మకం ఇచ్చే భాగస్వామిని పొందుతారని తెలిపింది.
అదే విధంగా మానసిక, శారీరకంగా బలంగా ఉంటూ, పిల్లలను పొందే అవకాశం ఉంటుందని తాజాగా వెల్లడించింది. ఈ సందేశం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికలపై వైరల్ అవుతోంది.
Details
మళ్లీ యాక్షన్ మోడ్ లోకి సమంత
సమంత అభిమానులు దీనిపై కమెంట్లు చేస్తూ, ఆమెకి అన్ని సంతోషాలూ కలగాలని ఆశించారు.
సమంత సినిమాల విషయానికొస్తే 'సిటడెల్'తో ప్రేక్షకులను అలరించిన తర్వాత ఇప్పుడు తన రాబోయే సిరీస్ 'రక్త్ బ్రహ్మాండ్' లో నటిస్తున్నది.
ఈ సిరీస్‌లో ఆమె ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. 'తుంబాడ్' ఫేమ్ రాహి అనిల్ బార్వే ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సిరీస్ సెట్లోకి అడుగుపెట్టిన సమంత, సామాజిక మాధ్యమాలలో ఈ విషయం షేర్ చేస్తూ 'మళ్లీ యాక్షన్ మోడ్‌లోకి వచ్చేశా' అని పేర్కొంది.