Samantha:ప్రకృతి ఒడిలో సమంత.. క్యూట్ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా!
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. హీరో విజయ్ దేవరకొండతో ఖుషి సినిమాను షూటింగ్ ను సామ్ పూర్తి చేసింది. అలాగే సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ కూడా ఇటీవలే ఫినిష్ చేసింది. తర్వాత ఏ మూవీకి ఆమె ఓకే చెప్పలేదు. ఈ తరుణంలో ఇండోనేషియాలోని పర్యాటక ప్రాంతం బాలిలో న్యూలుక్ లో ఎంజాయ్ చేస్తున్న వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేసింది. షార్ట్ హెయిర్ కట్ తో ఉన్న సమంతను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆ వీడియోలో బీచ్ వద్ద షార్ట్ హెయిర్ తో చిరునవ్వులు చిందిస్తూ అభిమానులను అలరించింది.
సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు ఖుషి మువీ
ఆ వీడియోను చూసిన అభిమానులు సమంత చాలా క్యూట్ గా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. షార్ట్ హెయిర్ తో సమంత్ లుక్ అదిరిపోయిందని నెటిజన్లు ట్విట్ చేస్తున్నారు. మరోవైపు సమంత మయోసైటిస్ అనే డిసీజ్ తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మెరుగైన చికిత్స కోసం ఆమె త్వరలో అమెరికాకు వెళ్లనున్నారు. ఇక సమంత నటించిన ఖుషి మూవీ సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. రొమాంటిక్ లవ్ స్టోరీతో ఈ చిత్రం వస్తోంది. ఇప్పటికే ఖుషి సినిమా నుంచి రిలీజైన రెండు సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి.