శాకుంతలం ప్రీమియర్స్ నుండి బయటకు వస్తున్న టాక్, సినిమా ఎలా ఉందంటే
ఈ వార్తాకథనం ఏంటి
సమంత కెరీర్ లో మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ అవుతున్న శాకుంతలం సినిమా ఏప్రిల్ 14వ తేదీన థియేటర్లలోకి రానుంది. మహాభారతంలో శకుంతల, దుష్యంతుల ప్రేమకథను శాకుంతలం ద్వారా ప్రేక్షకులకు త్రీడీలో చూపించబోతున్నాడు దర్శకుడు గుణశేఖర్.
అయితే ఈ సినిమాకు పెయిడ్ ప్రీమియర్స్ షోస్ వేసారు. విడుదలకు నాలుగు రోజుల ముందుగానే పెయిడ్ ప్రీమియర్స్ పడ్డాయి. ఈ ప్రీమియర్స్ నుండి శాకుంతలం టాక్ బయటకు వచ్చింది.
ప్రీమియర్ షో నుండి బయటకు వచ్చిన సినిమా గురించి తమ అభిప్రాయాలను ట్విట్టర్ లో పంచుకుంటున్నారు.
శాకుంతలం సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినట్లుగా తెలుస్తోంది. సమంత గ్లామర్, యాక్టింగ్ చాలా బాగుందని, త్రీడీలో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు.
Details
మొదటి ప్రీమియర్ కు పాజిటివ్ టాక్
కొందరు నెటిజన్లు శాకుంతలం సినిమా సెకండాఫ్ బాగుందని చెబుతున్నారు. సమంత, దేవ్ మోహన్ ల మధ్య కెమిస్ట్రీ తెర మీద చాలా బాగా కనిపించిందని కామెంట్స్ చేసారు. ఒకవైపు ఇలా ఉంటే మరికొంతమంది మిశ్రమ స్పందన తెలియజేస్తున్నారు.
సినిమా రిలీజ్ కి ఇంకా 3రోజుల సమయం ఉంది. మరిన్ని ప్రీమియర్స్ పడితే శాకుంతలం పూర్తి టాక్ బయటకు వచ్చేస్తుంది. మరి మరిన్ని ప్రీమియర్స్ వేస్తారా లేదా అనేది చూడాలి.
మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం గ్రంధం ఆధారంగా శాకుంతలం సినిమా రూపొందింది. గుణ టీమ్ వర్క్స్, శ్రీ వెంకటేశ్వర్ క్రియేషన్స్ బ్యానర్ లో సంయుక్తంగా శాకుంతలం సినిమాను తెరకెక్కించారు. మణిశర్మ సంగీతం అందించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
శాకుంతలం ప్రీమియర్స్ కు పాజిటివ్ టాక్
#Shaakuntalam premier show general audience reviews 🤍🥺@Samanthaprabhu2 pic.twitter.com/5WWS6Kj5Fu
— Jegan ♡ (@JeganSammu) April 11, 2023