తదుపరి వార్తా కథనం
కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్ లో సమంత: ఫోటోలు వైరల్
వ్రాసిన వారు
Sriram Pranateja
Jul 20, 2023
11:15 am
ఈ వార్తాకథనం ఏంటి
సినిమాల నుండి బ్రేక్ తీసుకోవాలనుకున్న సమంత, మరికొన్ని రోజుల్లో మయోసైటిస్ ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్ళనుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
అయితే ప్రస్తుతం సమంత కోయబత్తూర్ వెళ్ళారు. సద్గురు జగ్గీ వాసుదేవ్ స్థాపించిన ఈషా ఫౌండేషన్ లో ధ్యానం చేసారు. ధ్యానం తర్వాత తన అనుభూతిని సోషల్ మీడియాలో షేర్ చేసారు.
మెదడులో ఎలాంటి ఆలోచన లేకుండా, శరీరంలో ఎలాంటి కదలికలు లేకుండా ఉండడం అసాధ్యమని నాకు అనిపించింది. కానీ ఈరోజు ధ్యానం వల్ల నా ఆలోచనల్లో స్పష్టత, మనసులో ప్రశాంతత వచ్చిందని సమంత చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం ఈషా ఫౌండేషన్ లో అందరితో కలిసి ధ్యానం చేస్తున్న సమంత ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.