Page Loader
Samantha: నిర్మాణ బాధ్యతలు తీసుకున్న సమంత.. కొత్త సినిమా ఫిక్స్!
నిర్మాణ బాధ్యతలు తీసుకున్న సమంత.. కొత్త సినిమా ఫిక్స్!

Samantha: నిర్మాణ బాధ్యతలు తీసుకున్న సమంత.. కొత్త సినిమా ఫిక్స్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 21, 2025
05:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించిన సమంత.. ఇటీవల మాత్రం అక్కడి నుంచి గ్యాప్ తీసుకుంది. ఖుషి చిత్రం ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో, ఆ తర్వాత ఆమె మరే తెలుగు సినిమాను అంగీకరించలేదు. తెలుగు సినిమాల నుంచి దూరంగా ఉంటూ ఎక్కువగా హిందీ ప్రాజెక్టులపై దృష్టి సారించింది. ఈ మధ్య ఆమె నిర్మాతగా మారి నిర్మించిన శుభం చిత్రం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నా.. వ్యాపార పరంగా మాత్రం మంచి లాభాలు సమంత ఖాతాలో వేసింది. సమంత మరోసారి తెలుగు తెరకు రీ ఎంట్రీ ఇవ్వబోతోందని తెలుస్తోంది. ఆమె సన్నిహితురాలైన దర్శకురాలు నందిని రెడ్డితో కలిసి ఓ చిత్రాన్ని ఒప్పుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది వీరిద్దరి కాంబినేషన్‌లో మూడో సినిమా కానుంది.

Details

త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం

గతంలో వీరిద్దరూ కలిసి జబర్దస్త్ (హీరోగా సిద్ధార్థ్), ఓ బేబీ సినిమాలు చేశారు. ఓ బేబీ మంచి హిట్‌గా నిలవగా, ఆ సినిమా తర్వాత సమంత - నందిని కాంబినేషన్‌పై మంచి అంచనాలేర్పడ్డాయి. నందిని రెడ్డి చివరిసారిగా సంతోష్ శోభన్‌తో చేసిన 'అన్ని మంచి శకునములే' చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు ఆమె ఓ నూతన కథతో తిరిగి వస్తోంది. ఆ కథ వినగానే సమంత చాలా ఎక్సైట్ అయిందట. అందుకే ఇందులో కేవలం హీరోయిన్‌గానే కాకుండా.. నిర్మాతగానూ భాగస్వామ్యం కావాలని నిర్ణయించుకుందట. ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉండగా.. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది.