Loading...
Samantha: బేబీ బంప్‌తో సమంత.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న స్టార్ హీరోయిన్
బేబీ బంప్‌తో సమంత.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న స్టార్ హీరోయిన్

Samantha: బేబీ బంప్‌తో సమంత.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న స్టార్ హీరోయిన్

వ్రాసిన వారు Moogati Shabari
Aug 19, 2026
03:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు త్వరలో తల్లి కాబోతున్నారు. భర్త, దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి హాలిడేలో ఉన్న సమంత.. తాజాగా కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ ఫొటోల్లో సమంత ప్రెగ్నెన్సీ గ్లోతో, స్పష్టంగా కనిపిస్తున్న బేబీ బంప్‌తో ఎంతో సంతోషంగా కనిపించారు. 'జస్ట్ అస్' అంటూ క్యాప్షన్ ఇచ్చిన ఆమె.. గడియారం, బేబీ ఎమోజీలను కూడా జత చేశారు. దీంతో ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హాలిడేలో భాగంగా సమంత, రాజ్ నిడిమోరు కలిసి రుచికరమైన వంటకాలను ఆస్వాదిస్తూ, షాపింగ్ చేస్తూ, కాఫీ తాగుతూ, పికిల్‌బాల్ ఆడుతూ కనిపించారు.

వివరాలు

సినిమాలకు తాత్కాలికంగా విరామం..

ఈ పోస్ట్‌పై సమంత స్నేహితురాలు క్రేషా బజాజ్ 'కౌంట్‌డౌన్ మొదలైంది' అంటూ కామెంట్ చేశారు.

దీంతో బిడ్డ రాకకు సమయం దగ్గరపడిందనే సంకేతంగా అభిమానులు భావిస్తున్నారు.

ఫొటోలు చూసిన అభిమానులు, సినీ ప్రముఖులు సమంత దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

అయితే సమంత తన ప్రెగ్నెన్సీ విషయాన్ని గత జులైలోనే అధికారికంగా ప్రకటించారు.

హైదరాబాద్‌లో జరిగిన తన తాజా చిత్రం 'మా ఇంటి బంగారం' విజయోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ''క్షమించండి.. ఇంకో చిన్న గ్యాప్ తీసుకుని మళ్లీ వస్తాను.

ఇప్పుడు నేను మెటర్నిటీ లీవ్ తీసుకోవాలని నాకు తెలుసు. కానీ నేను చాలా సంతోషంగా ఉన్నాను'' అని చెప్పారు.

దీంతో సినిమాలకు తాత్కాలికంగా విరామం తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

వివరాలు

2025లో రాజ్ నిడిమోరుతో వివాహం..

సమంత, రాజ్ నిడిమోరుల వివాహం 2025లో జరిగింది. ఇద్దరికీ ఇది రెండో వివాహం. సమంత గతంలో నటుడు నాగచైతన్యను 2017లో వివాహం చేసుకున్నారు.

అయితే 2021లో ఇద్దరూ విడిపోయారు. ఇక రాజ్ నిడిమోరుకు కూడా గతంలో శ్యామలితో వివాహం జరిగింది.

2010లో 'ఏ మాయ చేసావె' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సమంత.. ఆ తర్వాత 'ఈగ', 'దూకుడు', 'అత్తారింటికి దారేది', 'రంగస్థలం' వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు.

'మహానటి', 'ఓ బేబీ', 'సూపర్ డీలక్స్' వంటి చిత్రాల్లో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

నిర్మాతగానూ మారిన సమంత.. 'శుభం', 'మా ఇంటి బంగారం' వంటి చిత్రాలను నిర్మించారు.

ప్రస్తుతం వ్యక్తిగత జీవితంలో కొత్తఅధ్యాయాన్ని ప్రారంభించేందుకు సమంత సిద్ధమవుతున్నారు.

ADVERTISEMENT