
ఆక్సిజన్ మాస్క్ తో సమంత: ఆందోళనలో అభిమానులు
ఈ వార్తాకథనం ఏంటి
మయోసైటిస్ వ్యాధితో పోరాడుతున్న సమంత, గత కొన్ని రోజులుగా అటు సోషల్ మీడియాలోనూ, ఇటు సినిమా షూటింగుల్లోనూ యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే.
అయితే తాజాగా ఇంస్టా లో ఆమె పెట్టిన పోస్టుతో అభిమానులు ఆందోళన పడుతున్నారు. ఒకేసారి నాలుగు ఫోటోలను షేర్ చేసిన సమంత, చివరి రెండు ఫోటోలతో అనేక ప్రశ్నలను లేవనెత్తేలా చేసింది.
పదహారేళ్ల ప్రాయం నాటి ఫోటోను మొదటగా పంచుకుంది. ఆ తరాత తన పెంపుడు కుక్కల ఫోటోలు కనిపించాయి. మూడవ ఫోటోగా ఆక్సిజన్ మాస్క్ పెట్టుకున్నట్లుగా సమంత కనిపించింది.
నాలుగవ ఫోటోలో హైపర్ బేరిక్ థెరపీ అంటే ఏమిటో తెలియజేస్తూ స్క్రీన్ షాట్ ని పంచుకుంది.
Details
హైపర్ బేరిక్ థెరపీ అంటే వివరించిన సమంత
ఆటో ఇమ్యూన్ వ్యాధులను నయం చేయడానికి ఉపయోగించే శక్తివంతమైన టూల్ గా హైపర్ బేరిక్ థెరపీ పనిచేస్తుందన్నట్టుగా నాలుగవ ఫోటోలో ఉంది.
హైపర్ బేరిక్ థెరపీ కారణంగా ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయని, శరీర కణజాలాలు రిపేర్ అవుతాయని ఆ ఫోటోలో ఉంది. ఈ ఫోటోలను చూడగానే సమంత అభిమానుల్లో ఆందోళన మొదలైంది.
సమంత, ఆక్సిజన్ మాస్క్ ఎందుకు పెట్టుకుందని ఆందోళన పడుతున్నారు. కొంతమందేమో హైపర్ బేరిక్ థెరపీ ప్రాసెస్ లో భాగంగా ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుంది కావచ్చని అంటున్నారు. మరి ఈ విషయంపై సమంత క్లారిటీ ఇస్తుందా లేదా అనేది చూడాలి.
సమంత, ప్రస్తుతం సిటాడెల్ ఇండియన్ వెర్షన్ లో కనిపిస్తుంది. అలాగే విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న ఖుషి సినిమాలో కనిపిస్తుంది.