మార్టిన్ లూథర్ కింగ్ ట్రైలర్: ఓటు హక్కుతో రాజకీయ నాయకులను చెడుగుడు ఆడించిన సామాన్యుడు
తమిళంలో సూపర్ హిట్ అయిన పొలిటికల్ సెటైర్ మూవీ మండేలా సినిమాకు తెలుగు రీమేక్ గా మార్టిన్ లూథర్ కింగ్ తెరకెక్కింది. ఈ సినిమాలో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ప్రధాన పాత్రలో కనిపిస్తున్నారు. కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా, సీనియర్ నటుడు నరేష్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. ట్రైలర్ లో చూపించిన దాని ప్రకారం, ఒక ఊరిలో సర్పంచ్ పదవి కోసం రెండు వర్గాలకు చెందిన నాయకులు పోటీపడతారు. ఒకరేమో తాను సర్పంచ్ గా గెలిస్తే ఊర్లో అందరినీ గోవా ట్రిప్ కి తీసుకెళ్తానని అంటారు. మరొకరేమో తాను గెలిస్తే ప్రతీ ఒక్కరి అకౌంట్లో 15వేల రూపాయలు వేస్తానని అంటాడు.
ఒక్క ఓటు కోసం రాజకీయ నాయకుల ఆరాటం
ఇద్దరి నాయకుల బలాబలాలు సమం అవడంతో గెలవడానికి ఒక్క ఓటు అవసరం అవుతుంది. ఆ ఓటు కోసం మార్టిన్ లూథర్ కింగ్(సంపూర్ణేష్ బాబు) వెంట పడతారు. అతన్ని ఆకట్టుకోవడానికి ఇద్దరు నాయకులు చేసే ప్రయత్నాన్ని ట్రైలర్ లో చూపించారు. ఇద్దరు నాయకుల నుండి కూడా కావలసినవన్నీ మార్టిన్ లూథర్ కింగ్ తీసుకుంటాడు. ఆ తర్వాత మార్టిన్ లూథర్ కింగ్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడన్నది సినిమా కథగా ఉండబోతుందని ట్రైలర్లో చూపించేశారు. మార్టిన్ లూథర్ కింగ్ పాత్రలో సంపూర్ణేష్ బాబు కనిపిస్తున్నారు. అలాగే మరొక ఇంపార్టెంట్ పాత్రలో ఫిదా ఫేమ్ శరణ్య కనిపిస్తుంది. పూజ కొల్లూరు దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 27న రిలీజ్ అవుతుంది.