LOADING...
Samyuktha Menon: బ్లాక్ గోల్డ్‌ ఫస్ట్‌లుక్ విడుద‌ల.. ఊచ‌కోత‌ కోసిన సంయుక్తా మీన‌న్ 
బ్లాక్ గోల్డ్‌ ఫస్ట్‌లుక్ విడుద‌ల.. ఊచ‌కోత‌ కోసిన సంయుక్తా మీన‌న్

Samyuktha Menon: బ్లాక్ గోల్డ్‌ ఫస్ట్‌లుక్ విడుద‌ల.. ఊచ‌కోత‌ కోసిన సంయుక్తా మీన‌న్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 20, 2025
11:29 am

ఈ వార్తాకథనం ఏంటి

భీమ్లా నాయక్ ఫేమ్ మలయాళ బ్యూటీ సంయుక్తా మీనన్, తొలిసారి హీరోయిన్ సెంట్రిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని యోగేశ్ కేఎంసీ డైరెక్ట్ చేస్తున్నాడు. షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతున్న ఈ సినిమా కోసం మేకర్స్ ఇప్పటికే "బ్లాక్ గోల్డ్" అనే టైటిల్‌ను ఫిక్స్ చేసి, లుక్ కూడా విడుదల చేశారు. ముందుగానే ప్రకటించినట్లుగా, మేకర్స్ బ్లాక్ గోల్డ్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ప్ర‌యాణికులెవ‌రూ లేని రైల్వే ప్లాట్ ఫాంపై, సంయుక్తా మీనన్ రౌడీ మూక‌లను ఊచ‌కోత కోసినట్టు క‌నిపిస్తున్న పోస్ట‌ర్ సినిమా చూసిన ప్రేక్ష‌కులకు రోమాలు నిక్క‌పొడుచుకోవ‌డం ఖాయ‌మ‌ని చెప్ప‌క‌నే చెబుతోంది.

వివరాలు 

ఈ సినిమా న‌ల్ల‌బంగారం (బొగ్గు)చుట్టూ తిరుగుతుంద‌ని డైరెక్టర్‌ హింట్

టైటిల్ లుక్‌లో బొగ్గు షేడ్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో రాళ్లతో డిజైన్ చేసి, మధ్యలో నాట్యం చేస్తున్న ప్రతిమ కనిపిస్తుంది. మొత్తం ఈ సినిమా నల్ల బంగారం (బ్లాక్ గోల్డ్) చుట్టూ తిరుగుతుందని డైరెక్టర్ సూత్రప్రాయంగా హింట్ ఇచ్చారనే మాట, టైటిల్ లుక్‌నే చెబుతుంది. ఈ మూవీని హాస్య మూవీస్,మాగంటి పిక్చర్స్ బ్యానర్ల పై సంయుక్తంగా రాజేశ్ దండా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఏ వ‌సంత్ సినిమాటోగ్ర‌ఫ‌ర్‌, చోటా కే ప్ర‌సాద్ ఎడిటింగ్‌. ఈ చిత్రానికి సంయుక్తామీన‌న్ స‌మ‌ర్ప‌కురాలిగా కూడా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం విశేషం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 సంయుక్తామీన‌న్  చేసిన ట్వీట్