Page Loader
Samyuktha Menon: సంయుక్త మీనన్ కి బాలీవుడ్ ఆఫర్
Samyuktha Menon: సంయుక్త మీనన్ కి బాలీవుడ్ ఆఫర్

Samyuktha Menon: సంయుక్త మీనన్ కి బాలీవుడ్ ఆఫర్

వ్రాసిన వారు Stalin
May 27, 2024
06:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణాది హీరోయిన్ లంతా హీందీ మూవీల్లో నటించడానికి ఆసక్తి చూపుతారు. ఇక్క‌డి నుంచి నార్త్ కు వెళ్లి అక్క‌డ క్రేజ్ సంపాదించి, అక్క‌డే హీరోయిన్లుగా సెటిలైన వారు చాలా త‌క్కువ‌. త్రిష,నయనతార లాంటి ఎంతో మంది హీరోయిన్లు బాలీవుడ్ లో త‌మ ల‌క్ ను టెస్ట్ చేసుకుని వెనుదిరిగి వ‌చ్చేశారు. ఇలాంటి టైంలో భీమ్లా నాయ‌క్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి మ‌ల‌యాళ బ్యూటీ సంయుక్తా మీన‌న్ ఇప్పుడు బాలీవుడ్ లో అడుగుపెడుతున్న‌ట్లు స‌మాచారం. ప్రభుదేవా, కాజల్ జంటగా నిర్మితమయ్యే మూవీలో ఈ మళయాళీ ముద్దుగుమ్మ నటించనుంది.

Details 

తల్లి తండ్రులు-పిల్లల మధ్య వుండే మానవ సంబంధాలపై మూవీ 

దాదాపుగా 28 సంవత్సరాల తర్వాత కాజల్..ప్రభుదేవాతో కలిసి నటించనుంది. తల్లి తండ్రులు - పిల్లల మధ్య వుండే మానవ సంబంధాలపై ఈ మూవీ తెరకెక్కనుంది. ఇంకా ఈ సినిమాకు టైటిల్ ప్రకటించలేదు. సీనియర్ నటులు నసీరిద్దున్ షా, జిషు సేన్ గుప్తా నటించనున్నారు. సంయుక్త మీనన్ ఇక ముంబై- హైదరాబాద్ మధ్య విమాన టికెట్లు బుక్ చేసుకోవాలి. సున్నితమైన భావాలు చక్కగా పలికించగలదనే సంయుక్త మీనన్ ను తీసుకున్నారు.ఆమె స్వతహాగా మళయాళీ కావడం విశేషం.