LOADING...
Sritej: సంధ్య థియేటర్ ఘటన.. శ్రీతేజ్ ఆరోగ్యంపై హెల్త్ బులిటన్ విడుదల

Sritej: సంధ్య థియేటర్ ఘటన.. శ్రీతేజ్ ఆరోగ్యంపై హెల్త్ బులిటన్ విడుదల

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 17, 2024
06:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రేవతి కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈరోజు హైదరాబాద్ సీపీ సివి. ఆనంద్ ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజ్‌ను పరామర్శించారు. ఆయన వెంట ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా కూడా ఉన్నారు. ఈ సందర్భంగా సీపీ సి.వి. ఆనంద్ మాట్లాడుతూ, తొక్కిసలాట ఘటన జరిగిన రెండు వారాలు పూర్తయ్యాయని తెలిపారు. శ్రీతేజ్‌కి బ్రెయిన్ డామేజ్ అయిన కారణంగా కోలుకోవడానికి మరింత సమయం అవసరమని చెప్పారు. ట్రీట్మెంట్ సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉందని ఆయన వివరించారు.

Details

భాద్యులపై చర్యలు తీసుకుంటాం

త్వరలో వైద్యులు ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేస్తారని తెలిపారు. అంతేకాకుండా హెల్త్ సెక్రటరీ క్రిస్టినా మాట్లాడుతూ, శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నామన్నారు. వైద్యుల నుంచి ప్రతి అప్‌డేట్‌ను తెలుసుకుంటున్నామని, అతడు త్వరగా కోలుకోవాలని ప్రభుత్వం తరఫున ఆకాంక్షిస్తున్నామని అన్నారు. ఈ ఘటనను మరింతగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీపీ సివి. ఆనంద్ తెలిపారు.