Sankranthi ki Vasthunnam: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న 'సంక్రాంతికి వస్తున్నాం' సాంగ్స్
ఈ వార్తాకథనం ఏంటి
ఫ్యామిలీ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన తాజా క్రైమ్ కామెడీ థ్రిల్లర్ చిత్రం "సంక్రాంతికి వస్తున్నాం".
ఈ చిత్రానికి ప్రముఖ కామెడీ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు.
ఈ సినిమా మూడు పాటలు విడుదలైన తర్వాత ట్రెండింగ్‌లో చేరి సెన్సేషన్ క్రియేట్ చేశాయి.
భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన "గోదారి గట్టు", "మీను", "బ్లాక్ బస్టర్ పొంగల్" పాటలు యూట్యూబ్, మ్యూజిక్ చార్ట్స్‌లో అగ్రస్థానాల్లో నిలిచాయి.
వివరాలు
మూడు పాటలకు కలిపి 85 మిలియన్ల వ్యూస్
"బ్లాక్ బస్టర్ పొంగల్" సాంగ్ ప్రస్తుతం 3వ స్థానంలో ఉంటే , "మీను" సాంగ్ 6వ స్థానంలో, "గోదారి గట్టు" సాంగ్ 10వ స్థానంలో ఉన్నది.
ఈ మూడు పాటలకు కలిపి 85 మిలియన్ల వ్యూస్ (8.5 కోట్లు) నమోదయ్యాయి.
ఈ పాటలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో కూడా ట్రెండ్ అవుతున్నాయి.
ఫ్యాన్స్ ఆ పాటలపై డ్యాన్స్ కవర్‌లు, రీల్స్ చేసుకుని వైరల్ చేస్తున్నారు.
100 మిలియన్ వ్యూస్‌కు చేరువయ్యే ఈ పాటలు "సంక్రాంతికి వస్తున్నాం" చిత్రాన్ని సెన్సేషనల్ హిట్‌గా నిలిపాయి.
వివరాలు
ఎక్స్ పోలీస్ పాత్రలో వెంకటేష్
ఈ చిత్రంలో వెంకటేష్ ఒక ఎక్స్ పోలీస్ పాత్రలో నటిస్తే, ఆయన జోడీగా ఐశ్వర్య రాజేష్ (ఎక్స్ భార్య), మీనాక్షి చౌదరి (ఎక్స్ లవర్) నటించారు.
ఇతర పాత్రల్లో ఉపేంద్ర లిమాయే, సాయి కుమార్, నరేష్, వీటీ గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్ మహేష్ బాలరాజ్, ప్రదీప్ కబ్రా, చిట్టి నటించారు.
ఈ సినిమా జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదలవుతోంది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, ఎస్ కృష్ణ మరియు జి ఆదినారాయణ స్క్రీన్‌ప్లే, తమ్మిరాజు ఎడిటింగ్, వి వెంకట్ యాక్షన్ సన్నివేశాల కొరియోగ్రఫీకి బాధ్యత వహించారు.