
Santosham OTT Awards : సినీప్రముఖుల మధ్య అట్టహాసంగా సంతోషం ఓటిటి అవార్డ్స్
ఈ వార్తాకథనం ఏంటి
'సంతోషం `ఓటిటి' అవార్డ్స్ పేరుతో ఓటిటిలో విడుదలయ్యే తెలుగు సినిమాలకు సీనియర్ జర్నలిస్ట్, నిర్మాత సురేష్ కొండేటి ఆధ్వర్యంలో అవార్డులు ప్రదానం చేశారు.
ఈ వేడుకలకు అలనాటి నటీమణి జయసుధ, మురళీ మోహన్, జేడీ చక్రవర్తి తదితరులు హాజరయ్యారు.
గతేడాది తెలుగులో మొదటిసారిగా ఓటిటి అవార్డులు ఇవ్వడం కొసమెరుపు. సోమవారం సంతోషం ఓటిటి అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని రెండో సంవత్సరం హైదరాబాద్'లోని పార్క్ హయత్'లో ఘనంగా నిర్వహించారు.
గత 21 ఏళ్లుగా సురేష్ కొండేటి ఆధ్వర్యంలో సంతోషం అవార్డ్స్ ప్రదాన కార్యక్రమం ఘనంగా జరుగుతున్నాయి.
త్వరలో 22వ సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ జరగనున్నాయి. ఇవి మరింత గ్రాండ్ గా గోవాలో నిర్వహించనున్నారు.
DETAILS
యాంకరింగ్ చేసిన రవి, ఇమ్మాన్యుయేల్, వర్ష
ఓటిటి అవార్డు వేడుకలకు యాంకర్ రవి, ఇమ్మాన్యుయేల్, వర్ష యాంకరింగ్ చేశారు. సిమ్రాన్ గుప్తా, డింపుల్ హయతి, పలువురు హీరోయిన్లు హాజరయ్యారు.
మురళీమోహన్, జయసుధ, విజయేంద్రప్రసాద్, ఎస్వీ కృష్ణారెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ, డింపుల్ హయతి, డైరెక్టర్ వసిష్ఠ, నిర్మాత SKN, ఓంకార్, డైరెక్టర్ సాయి రాజేష్, హంసానందిని, అనూప్ రూబెన్స్, జెడి చక్రవర్తి, అనసూయ, నిరుపమ్, హీరో వేణు సహా అనేక మంది సినీ ప్రముఖులు సందడి చేశారు.
సంతోషం ఓటిటి అవార్డ్స్ జాబితా ఇదే :
1. ఉత్తమ చిత్రం - ప్రేమ విమానం
2. ఉత్తమ నటుడు - జెడి చక్రవర్తి (దయ సిరీస్)
details
ఉత్తమ సహాయ నటిగా అనసూయ (ప్రేమ విమానం)
3. క్రిటిక్స్ ఉత్తమ నటుడు - వేణు (అతిథి సిరీస్)
4. ఉత్తమ నూతన దర్శకుడు - ఓంకార్ (మ్యాన్షన్ 24 సిరీస్)
5. ఉత్తమ దర్శకుడు - ఆనంద్ రంగ (వ్యవస్థ)
6. ఉత్తమ నూతన సహాయనటుడు - శ్రీనివాస్ గవిరెడ్డి (కుమారి శ్రీమతి)
7. ఉత్తమ సహాయనటుడు - జోష్ రవి (దయ)
8. ఉత్తమ సహాయ నటి - అనసూయ (ప్రేమ విమానం)
9. ఉత్తమ విలన్ - సుహాస్ (యాంగర్ టెయిల్స్)
10. ఉత్తమ సంగీత దర్శకుడు - అనూప్ రూబెన్స్ (నిషాని)
11. ఉత్తమ సినిమాటోగ్రఫీ - వివేక్ కాలెపు(దయ)
12. ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ - అనిరుధ్, దేవాన్ష్ (ప్రేమ విమానం)