Page Loader
Saree : శ్రీలక్ష్మీ సతీష్ 'శారీ ' ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. చీరకట్టు భామ సినిమాలో దర్శకుడు ఎవరో తెలుసా 
శ్రీలక్ష్మీ సతీష్ 'శారీ ' ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

Saree : శ్రీలక్ష్మీ సతీష్ 'శారీ ' ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. చీరకట్టు భామ సినిమాలో దర్శకుడు ఎవరో తెలుసా 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Dec 21, 2023
04:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

డిఫరెంట్ టేకింగ్'తో తనదైన శైలిలో సినిమాలు తీయడం టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రత్యేకత. కొన్నాళ్ల క్రితం చీర కట్టుకుని రీల్స్ చేసిన ఓ అమ్మాయి వీడియోస్ ఆర్జీవిని తెగ ఇంప్రెస్ చేశాయి.ఆ అమ్మాయి ఎవరో తెలిస్తే కాస్త చెప్పండి,తనపై చీర అనే సినిమా తీస్తానని ప్రకటించారు. అయితే ఆ చీరకట్టు భామ పేరు శ్రీలక్ష్మీ సతీష్ చీరకట్టులో ప్రకృతిని ఆస్వాదిస్తూ పలు రీల్స్ చేసింది. అయితే ఈ చీర చిత్రానికి, లక్ష్మి సతీష్ రీల్స్ తీసిన కెమెరామెన్ అఘోష్ ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు వర్మ. తాజాగా ఇవాళ ఇంటర్నేషనల్ శారీ డే సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైంది. డెన్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చీర చిత్రానికి దర్శకుడు అతనే