Jetlee Review : 'జెట్లీ' మూవీ రివ్యూ.. హీరోగా అదరగొట్టిన కమెడియన్ సత్య
ఈ వార్తాకథనం ఏంటి
కమెడియన్ సత్య ప్రధాన పాత్రలో, వెన్నెల కిషోర్, రియా సింగ్, అజయ్, కబీర్ సింగ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం 'జెట్లీ'. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మాణంలో, రితేష్ రానా దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి టాక్‌తో దూసుకుపోతోంది.
వివరాలు
కథ ఏమిటంటే..
ప్రజాపతి (అజయ్) తన బ్యాంక్ దివాలా తీసిందని ప్రకటించి, అందులోని డబ్బుతో పారిపోతాడు. వెళ్లే ముందు అదే బ్యాంక్‌కు చెందిన మరో అధికారి హరిచంద్ర ప్రసాద్ (శుభలేఖ సుధాకర్)ను హత్య చేస్తాడు.
ప్రజల నుంచి భారీగా డబ్బు దోచుకున్నాడనే కారణంగా అతనిపై తీవ్ర వ్యతిరేకత పెరుగుతుంది.
మరోవైపు, హోమ్ మినిస్టర్ కూడా అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు.
ప్రజాపతిని చంపేందుకు కొందరు కూడా ప్రయత్నిస్తుంటారు. ఆరు నెలల తర్వాత ప్రజాపతి లొంగిపోతానని ప్రకటించి, దుబాయ్ నుంచి ఇండియాకు రావడానికి నిర్ణయిస్తాడు.
ఇందుకు ఏజెంట్ శివాని రాయి (రియా సింగ్), ఆమె టీం సహాయం తీసుకుని విమానంలో బయలుదేరుతాడు.
వివరాలు
ప్రజల డబ్బు చుట్టూ తిరిగే కథ..
అదే విమానంలో అతన్ని హతమార్చాలనే ఉద్దేశంతో కొందరు, అలాగే అతని అనుచరులు కూడా ఉంటారు.
ఈ ప్రయాణంలో డాక్టర్ వేదవ్యాస్ (సత్య) కూడా ఉంటాడు. అయితే అతను తన గతాన్ని పూర్తిగా మర్చిపోయి, చుట్టూ ఉన్నవారి మాటల ఆధారంగా తన గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాడు.
అసలు వేదవ్యాస్ ఎవరు? అతను ప్రజాపతిని కాపాడటానికా లేదా చంపటానికా వచ్చాడు?
ప్రజాపతిని చివరికి ఎవరు హతమారుస్తారు? ప్రజల డబ్బు తిరిగి వస్తుందా?
విమానంలో ఉన్నవాళ్ల అసలు స్వరూపం ఏమిటి? వీరి నేపథ్యం ఏంటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
వివరాలు
సినిమా ఎలా ఉంది అంటే..
సత్య - రితేష్ రానా కాంబినేషన్‌లో వచ్చిన 'మత్తు వదలరా' సినిమాలు మంచి విజయాన్ని సాధించడంతో, ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ఫస్ట్ హాఫ్‌లో ప్రధానంగా ప్రజాపతి కథను చూపిస్తూ, అతను దుబాయ్ నుంచి భారత్‌కి రావడం, విమానంలో జరుగుతున్న పరిణామాలు, అందులో ఉన్న పాత్రల పరిచయం వంటివి చూపిస్తారు.
సత్య పాత్రకు సంబంధించిన మెమరీ లాస్ ట్రాక్, అతనిపై జరిగిన దాడి, తన గుర్తింపును తిరిగి పొందే ప్రయత్నం వంటి అంశాలు ఇందులో ఉంటాయి.
వివరాలు
సత్య, వెన్నెల కిషోర్ కామెడీ హైలెట్..
అయితే ఫస్ట్ హాఫ్ కొంత నెమ్మదిగా సాగుతుంది. మధ్య మధ్యలో వచ్చే కామెడీ డైలాగులు, స్పూఫ్ సన్నివేశాలు ఉన్నప్పటికీ, మొత్తం మీద ఆసక్తిని నిలబెట్టడంలో కొంత తగ్గుతుంది.
సెకండ్ హాఫ్‌లో అసలు కథ ముందుకు కదులుతుంది. బ్యాంక్ స్కామ్ వెనుక నిజం ఏమిటి?
సత్య పాత్ర అసలు ఎవరు? వెన్నెల కిషోర్ పాత్ర ప్రాముఖ్యత ఏమిటి? వంటి అంశాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి.
కథ పెద్దగా బలంగా లేకపోయినా, సత్య, వెన్నెల కిషోర్ కామెడీతో సినిమా ముందుకు నడిపించారు.
అయితే చాలా చోట్ల సినిమా బోర్‌గా అనిపించవచ్చు. కొన్ని సన్నివేశాల్లో కామెడీ కూడా అంతగా వర్క్ కాలేదనే భావన కలుగుతుంది.