Page Loader
Satyabhama OTT: మరో ఓటీటీలోకి అడుగుపెడుతున్న సత్యభామ చిత్రం.. డేట్ ఇదే
మరో ఓటీటీలోకి అడుగుపెడుతున్న సత్యభామ చిత్రం.. డేట్ ఇదే

Satyabhama OTT: మరో ఓటీటీలోకి అడుగుపెడుతున్న సత్యభామ చిత్రం.. డేట్ ఇదే

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 30, 2024
10:02 am

ఈ వార్తాకథనం ఏంటి

క్రైమ్, థ్రిల్లర్ తో తెరకెక్కిన సత్యభామ మూవీలో కాజల్ అగర్వాల్ మెయిన్ రోల్ పోషించింది. తాజాగా ఈ సినిమా మరో ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు రానుంది. ఈ సినిమాకు సుమన్ చిక్కల దర్శకత్వం వహించారు. ఇందులో కాజల్ అగర్వాల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా మెప్పించారు. జూన్ 7వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఓ మోస్తరుగా కలెక్షన్లు సాధించింది. ఈ చిత్రం జూన్ 28వ తేదీని అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చి, మంచి వ్యూస్ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్‌లో టాప్‌లో నిలవడం విశేషం.

Details

ఆగస్టు 1న ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్

సత్యభామ మూవీ ఆగస్టు 1వ తేదీన ఈటీవీ విన్ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌కు రానున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. కాజల్ అగర్వాల్ తో పాటు ఈ చిత్రంలో నవీన్ చంద్ర కూడా లీడ్ రోల్ చేశారు. ఇక ప్రకాశ్ రాజ్, నాగివీడు, రవివర్మ, హర్షవర్దన్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చాడు.