LOADING...
Rao Bahadur: 'రావు బహదూర్' ఫస్ట్ లుక్‌లో సత్యదేవ్‌ మైండ్ బ్లోయింగ్ మేకోవర్
'రావు బహదూర్' ఫస్ట్ లుక్‌లో సత్యదేవ్‌ మైండ్ బ్లోయింగ్ మేకోవర్

Rao Bahadur: 'రావు బహదూర్' ఫస్ట్ లుక్‌లో సత్యదేవ్‌ మైండ్ బ్లోయింగ్ మేకోవర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 12, 2025
01:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

మన టాలీవుడ్‌లో టాలెంటెడ్, అండర్‌రేటెడ్ నటుల్లో సత్యదేవ్ కూడా ఒకరు. బ్లఫ్ మాస్టర్ సినిమా తర్వాత ఆయన నటనకు చాలామంది అభిమానులయ్యారు. తాజాగా జీబ్రా చిత్రంతో ఆకట్టుకున్న ఆయన నుంచి ఇంకా ఎక్కువ ఆశిస్తున్న వారికి సమాధానం చెప్పినట్టుగా, ఆయన కొత్త సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. "రావు బహదూర్" అనే టైటిల్‌తో సత్యదేవ్ పూర్తిగా భిన్నమైన లుక్‌లో కనిపించాడు. ఒక ముసలి రాజు, ఇంకా చెప్పాలంటే తాతగానూ, పైగా ముసలి భూతంగానూ ఆయన రూపం షాకింగ్‌గా ఉంది.

Details

ఈ చిత్రంపై భారీ అంచనాలు

పోస్టర్‌లో చిన్న పిల్లలు కూడా కనిపించడం వల్ల ఇది ఫాంటసీ డ్రామా కానుందా? అనే ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ చిత్రాన్ని కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కిస్తున్నారు. "అనుమానం పెనుభూతం" అనే లైన్‌ను హైలైట్ చేస్తూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సత్యదేవ్ నుంచి ప్రేక్షకులు కోరుకునే కొత్తదనం మళ్ళీ ఆయనలో కనిపించబోతోందని, మహేశ్వర ఉగ్రరూపస్య తరహా ఇంపాక్ట్‌ను వెంకటేష్ మహా మళ్ళీ అందించబోతున్నాడని అనిపిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీచక్ర ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ సినిమాస్ నిర్మిస్తుండగా, సూపర్ స్టార్ మహేష్ బాబు సమర్పిస్తున్నారు. ఇక ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి.