Page Loader
Satyam Sundram: ప్రేక్షకుల మనసు గెలుచుకున్న 'సత్యం సుందరం'.. కార్తీ, అరవింద్ స్వామి నటన అద్భుతం 
ప్రేక్షకుల మనసు గెలుచుకున్న 'సత్యం సుందరం'.. కార్తీ, అరవింద్ స్వామి నటన అద్భుతం

Satyam Sundram: ప్రేక్షకుల మనసు గెలుచుకున్న 'సత్యం సుందరం'.. కార్తీ, అరవింద్ స్వామి నటన అద్భుతం 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 28, 2024
10:15 am

ఈ వార్తాకథనం ఏంటి

కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన కుటుంబ కథా చిత్రం 'సత్యం సుందరం'. వీరిద్దరూ హీరోలుగా కాకుండా మన కుటుంబ సభ్యులుగా అనిపించేటట్లుగా తమ పాత్రల్లో ఒదిగిపోయమైన ప్రేక్షకులను ఆకట్టుకుంది. '96' వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన సి ప్రేమ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, సూర్య, జ్యోతిక 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 28న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, కుటుంబ బంధాల విలువలను ప్రతిబింబిస్తూ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణను అందుకుంది. కార్తీ, అరవింద్ స్వామి తమ నటనతో బావ-బావమరుదులుగా ప్రేక్షకులను కదిలించి, భావోద్వేగానికి గురిచేశారు.

Details

విశేష ఆదరణ పొందుతున్న సత్యం సుందరం

ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల కోసం ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా విడుదలైంది. తాజాగా 'సత్యం సుందరం' నెట్‌ ఫ్లిక్స్‌లో విడుదలై అక్కడ కూడా విశేష ఆదరణ పొందుతోంది. 'ఇలాంటి హృదయాన్ని హత్తుకునే చిత్రాలు అరుదుగా మాత్రమే వస్తాయి' అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సుందరం పాత్రలో కార్తీ మనం అందరిమధ్య ఉండాలి అనిపించేలా అద్భుతంగా జీవించారని పలువురు ప్రశంసిస్తున్నారు. కుటుంబ బంధాలు, మనస్ఫూర్తితో పంచుకునే ప్రేమే నిజమైన సంపద అని ఈ కథ ద్వారా దర్శకుడు ప్రేమ్ కుమార్ అందించిన సందేశాన్ని చూసిన ప్రేక్షకులు అభినందిస్తున్నారు.