Page Loader
Save The Tigers: 'సేవ్ ది టైగర్స్' సీజన్ 2 స్ట్రీమింగ్ తేదీ వెల్లడించిన మేకర్స్ 

Save The Tigers: 'సేవ్ ది టైగర్స్' సీజన్ 2 స్ట్రీమింగ్ తేదీ వెల్లడించిన మేకర్స్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 02, 2024
01:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు ఓటిటి స్పేస్‌లో వెబ్ సిరీస్ లకు క్రేజ్ ఎక్కువ..టాలీవుడ్ లోని ప్రముఖ నటులు కూడా వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. ప్రియదర్శి,అభినవ్ గోమతం,కృష్ణ చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో భారీ క్రేజ్ ను సంపాదించుకుంది. ఇప్పుడు 'సేవ్ ద టైగర్స్ 2' రాబోతుంది. ఈరోజు సీరిస్ కు సంబందించిన ట్రైలర్ ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

హాట్ స్టార్ చేసిన ట్వీట్  

Details 

మార్చి 15 నుండి స్ట్రీమింగ్‌ 

ట్రైలర్‌తో పాటు, సీజన్ 2 మార్చి 15 నుండి స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. అరుణ్ కొత్తపల్లి దర్శకత్వం వహించగా, యాత్ర దర్శకుడు మహి వి రాఘవ్, ప్రదీప్ అద్వైతం ఈ షో రూపకర్తలు. సేవ్ ది టైగర్స్ 2లో సీరత్ కపూర్, జోర్దార్ సుజాత, పావని గంగిరెడ్డి, దేవియాని శర్మ, గంగవ్వ, దర్శన బానిక్, వేణు యల్దండి కీలక పాత్రలు పోషించారు. అజయ్ అరసాడ స్వరాలు సమకూర్చారు.