స్కామ్ 2003: నకిలీ స్టాంప్ పేపర్ల కుంభకోణంపై వస్తున్న సిరీస్ గురించి ఆసక్తికరమైన విషయాలు
స్టాక్ మార్కెట్ విషయంలో హర్షద్ మెహతా స్కామ్ గురించి స్కామ్ 1992 సినిమా వచ్చిందన్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం స్కామ్ 1992 తరహాలోనే స్కామ్ 2003 ది తెల్గీ స్టోరీ సిరీస్ వస్తోంది. యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సిరీస్ గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. స్కామ్ 2003 ది తెల్గీ స్టోరీ సిరీస్ లో స్కామ్ ఏంటి? నకిలీ స్టాంప్ పేపర్ల కుంభకోణంపై ఈ సిరీస్ ను రూపొందించారు. ప్రముఖ జర్నలిస్ట్ సంజయ్ సింగ్ రాసిన పుస్తకం ఆధారంగా ఈ సిరీస్ ని రూపొందించారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో గగన్ దేవ్ రియార్ నటిస్తున్నారు.
30వేల కోట్ల కుంభకోణం
2003లో నకిలీ స్టాంప్ పేపర్ల కుంభకోణం బయటపడింది. అప్పట్లో ఈ కుంభకోణం విలువ 30వేల కోట్లకు పైగానే ఉందని తేలింది. ప్రస్తుతం ఈ సిరీస్ లో స్టాంప్ పేపర్ల కుంభకోణం ఎలా మొదలైంది? ఎలా సాగింది? చివరకు ఈ కుంభకోణం ఎలా బయటపడిందనే విషయాలను ఈ సిరీస్ లో చూపించబోతున్నారు. అప్లాజ్ ఎంటర్ టైన్మెంట్, స్టూడియో నెక్స్ట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన ఈ సిరీస్ ని తుషార్ హిరానందిని డైరెక్ట్ చేసారు. స్కామ్ 2003 ది తెల్గీ స్టోరీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది? సోనీ లివ్ ఫ్లాట్ ఫామ్ లో సెప్టెంబర్ 1వ తేదీ నుండి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్, తెలుగు వెర్షన్ లో కూడా అందుబాటులో ఉందని సమాచారం.