Citadel: హిందీ మాట్లాడాలంటే భయంగా ఉంటుంది : సమంత
ఈ వార్తాకథనం ఏంటి
సమంత, వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ 'సిటాడెల్ హనీ బన్నీ' అమెజాన్ ప్రైమ్‌లో నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఈ నేపథ్యంలో, సిరీస్ టీమ్ వివిధ ఇంటర్వ్యూల్లో పాల్గొని కథా విషయాలను పంచుకున్నారు.
సిరీస్ దర్శకులు రాజ్ అండ్ డీకే తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, సిరీస్‌లో కథానాయికగా సమంతను మొదట అనుకోలేదని తెలిపారు.
'ది ఫ్యామిలీ మ్యాన్-2' చిత్రీకరణ సమయంలో 'సిటాడెల్' స్క్రిప్ట్ దశలోనే ఉంది. అందుకే సమంత దీనిపై మాట్లాడలేదు.
ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాక, హీరోగా వరుణ్‌ను ఎంపిక చేశామని, కథానాయికగా ఎవరు ఉండాలని ఆలోచించామని చెప్పారు.
Details
సమంతపై ప్రశంసలు కురిపించిన వరుణ్
వరుణ్ హిందీ మాట్లాడతాడని కావున కథానాయిక కూడా హిందీ మాట్లాడే వారైనా బాగుంటుందని అనుకున్నామని పేర్కొన్నారు.
'ది ఫ్యామిలీ మ్యాన్-2' సమయంలో సమంత హిందీ మాట్లాడలేదు. అయితే ఒకరోజు ఆమె హిందీలో మాట్లాడడం చూసి తాము ఆశ్చర్యపోయామన్నారు.
వెంటనే ఆమెతో సిరీస్ చేయాలని భావించామని వారు వెల్లడించారు. హనీ పాత్రకు హిందీ బాగా వస్తుందని, తాను మాట్లాడేటప్పుడు ఏమైనా తప్పులుంటాయనే భయంతోనే తాను వేదికపై హిందీలో మాట్లాడనని సమంత పేర్కొంది.
ఈ ఇంటర్వ్యూలో వరుణ్ కూడా సమంతపై ప్రశంసలు కురిపించారు.
'సిటాడెల్: హనీ బన్ని' యాక్షన్ థ్రిల్లింగ్ వెబ్‌సిరీస్‌గా రూపొందింది. ఇందులో సమంత హనీ పాత్రలో కనిపించనున్నారు.