తదుపరి వార్తా కథనం

ఖుషి సెకండ్ సింగిల్ ప్రోమో: సిద్ శ్రీరామ్ గొంతులోంచి వస్తున్న పాట రిలీజ్ ఎప్పుడంటే?
వ్రాసిన వారు
Sriram Pranateja
Jul 10, 2023
05:57 pm
ఈ వార్తాకథనం ఏంటి
విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఖుషి సినిమా నుండి నా రోజా నువ్వే అనే పాట రిలీజైన సంగతి తెలిసిందే. ఈ పాటకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.
ప్రస్తుతం ఈ సినిమా నుండి సెకండ్ సింగిల్ ని రిలీజ్ చేయబోతున్నారు. అంతకంటే ముందుగా రెండవ పాట ప్రోమోని వదిలారు.
నాతో రా ఆరాధ్య అంటూ సాగే ఈ పాటను సిద్ శ్రీరామ్, చిన్మయి పాడారు. మొదటి పాట రాసిన దర్శకుడు శివ నిర్వాణ, ఈ పాటను కూడా రాసారు.
ప్రోమో ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో పాట బాగుంటుందని అంచనా వేస్తున్నారు. పూర్తి పాటను జులై 12న రిలీజ్ చేస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నాతో రా ఆరాధ్య ప్రోమో
#Kushi 2nd song Promo#Aradhya ❤️https://t.co/deTuIBbQzp pic.twitter.com/fEcHVfVxij
— Vijay Deverakonda (@TheDeverakonda) July 10, 2023