Seema Haider: సినిమాలో 'రా' ఆఫీసర్‌గా సీమా హైదర్!
ప్రేమించిన వ్యక్తి కోసం దేశ సరిహద్దులను దాటి ఇండియాలోకి అక్రమంగా ప్రవేశించిన పాకిస్థాన్ మహిళ సీమా గులాం హైదర్ కు సినిమాలో నటించే అవకాశం లభించింది. ఐఎస్ఐ ఏజెంట్‌గా అనుమానిస్తున్న సీమా హైదర్ ఈ సినిమాలో 'రా' ఆఫీసర్‌గా నటించనుంది. జనిఫైర్ ఫాక్స్ ప్రొడక్షన్ సంస్థ గ్రేటర్ నోయిడాలో సీమాను సంప్రదించారు. రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో ఇస్లామిక్ రాడికల్స్ చేతిలో హత్యకు గురైన టైలర్ కన్హయ్య లాప్ పై తెరకెక్కుతున్న 'A Tailor Murder Story' చిత్రలో 'రా' ఆఫీసర్ పాత్ర కోసం ఆమెను చిత్ర బృందం కలిసింది. జూలై 4న, సీమా భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించినందుకు పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఆహారం లేక ఇబ్బందులు పడ్డ సీమా హైదర్, సచిన్ మీనా
ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో సీమా హైదర్, ఆమె ప్రియుడు సచిన్ మీనా కొత్త ఇంటికి వచ్చిన తర్వాత వారు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆహారం కోసం నిత్యావసర సరుకులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని దంపతులు సీమా, సచిన్ తెలిపారు. దీంతో సినిమా దర్శకులు సీమా హైదర్ కు సినిమాల్లో నటించేందుకు అవకాశాన్ని కల్పించినట్లు తెలుస్తోంది. సీమాకు గులాం హైదర్ తో వివాహమై నలుగురు పిల్లలున్నారు. అయినా సచిన్‌తో కలిసి ఉండేందుకు పాకిస్థాన్ ను విడిచి ఇండియాలోకి ఆమె అక్రమంగా ప్రవేశించింది. సీమా హిందూ మతంలోకి మారిన తర్వాత ఇద్దరూ హిందూ ఆచారాల ప్రకారం ప్రేమ వివాహం చేసుకున్నారు.