ప్రాణహాని ఉందని నటుడు నరేష్ వ్యాఖ్యలు: లైసెన్స్ రివాల్వర్ కు అనుమతి ఇవ్వాలని రిక్వెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
సీనియర్ నటుడు నరేష్ గతకొన్ని రోజులుగ అనేక కారణాల వల్ల వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. తాజాగా లైసెన్స్ రివాల్వర్ కు అనుమతి ఇవ్వాలని పోలీసులను రిక్వెస్ట్ చేసారు.
తన ప్రాణానికి హాని ఉందని, అందువల్ల లైసెన్స్ రివాల్వర్ కావాలని శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డిని నరేష్ కలిసారు. ఈ విషయమై ఎస్పీ పాజిటివ్ గా స్పందించినట్లు నరేష్ చెప్పుకొచ్చారు.
ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో నరేష్ ఇంటిపై దాడి జరిగింది. నరేష్ ఇంటి ముందున్న కారును ఎవరో దుండగులు బద్దలు కొట్టారు. ఈ విషయమై నరేష్ పోలీసు కంప్లయింట్ కూడా ఇచ్చారు.
Details
మూడవ భర్య రమ్య రఘుపతితో గొడవలు
గతకొన్ని రోజులుగా తన మూడవ భార్య రమ్య రఘుపతితో నరేష్ కు వివాదాలు నడుస్తున్నాయి. ఈ మధ్య నరేష్, పవిత్రా లోకేష్ నటించిన మళ్ళీ పెళ్ళి సినిమాను రమ్య రఘుపతి అడ్డుకోవాలని చూసిన సంగతి తెలిసిందే.
నరేష్, పవిత్రా లోకేష్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా మళ్ళీ పెళ్ళి సినిమాను తెరకెక్కించారు. అందులో తన పాత్రను కించపరిచే విధంగా చిత్రీకరించారని రమ్య రఘుపతి కోర్టును ఆశ్రయించారు.
ఇక నరేష్ సినిమా విషయానికి వస్తే, మళ్ళీ పెళ్ళి సినిమాకు బాక్సాఫీసు వద్ద సరైన స్పందన రాలేదు. కానీ ఇటీవల రిలీజైన నరేష్ నటించిన సామజవరగమన చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో నరేష్ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి.