Peddi Movie : పదేళ్ల తర్వాత మళ్లీ చరణ్‌తో స్క్రీన్‌పై కనిపించనున్న హీరో.. 'పెద్ది'లో కీలక పాత్రలో ఎవరంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో 'పెద్ది' ఒకటి. దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పాన్ ఇండియా సినిమా స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. స్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం లో చరణ్ మాస్ లుక్‌లో కనిపించబోతున్నారు. 'రంగస్థలం' తర్వాత అదే స్థాయిలో ప్రత్యేకమైన పాత్రతో, ఆకట్టుకునే రూపంతో చరణ్ కనిపిస్తారని అభిమానులు భావిస్తున్నారు. అందుకే ఈ సినిమా విడుదల కోసం వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్, గ్లింప్స్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచాయి.
వివరాలు
రిపీట్ కానున్న ఆ కాంబో..
ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చనీయాంశమైంది. ఈ సినిమాలో ఒక సీనియర్ హీరో కూడా నటిస్తున్నారని సమాచారం. దాదాపు పదేళ్ల విరామం తర్వాత ఆయన చరణ్‌తో కలిసి కనిపించబోతున్నారని టాక్. ఈ వార్త అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. లభించిన సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో సీనియర్ నటుడు సాయి కుమార్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఒక అభిమాని చిత్రీకరించిన వీడియో ద్వారా ఆయన ఈ సినిమాలో భాగమయ్యారని తెలుస్తోంది. గతంలో విడుదలైన 'ఎవడు' సినిమాలో చరణ్, సాయి కుమార్ కలిసి నటించారు.
వివరాలు
విలన్‌గా ఆ సీనియర్ నటుడు..
ఆ చిత్రంలో సాయి కుమార్ విలన్‌గా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇప్పుడు మళ్లీ చరణ్‌తో కలిసి ఆయన కనిపించబోతుండటం అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఇప్పటికే 'పెద్ది' సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉండబోతుందని సమాచారం. మొదట ఈ పాట కోసం మృణాల్ పేరు వినిపించగా, ప్రస్తుతం మానస వారణాసి పేరు ముందుకు వచ్చింది. ఈ పాటలో ఆమె చరణ్‌తో కలిసి నృత్యం చేయనున్నట్లు తెలుస్తోంది.