NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / రాముడిలా కాదు కర్ణుడిలా ఉన్నాడు: ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ లుక్ పై సీరియల్ నటి కామెంట్స్ 
    తదుపరి వార్తా కథనం
    రాముడిలా కాదు కర్ణుడిలా ఉన్నాడు: ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ లుక్ పై సీరియల్ నటి కామెంట్స్ 
    ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ లుక్ పై కామెంట్స్ చేసిన కస్తూరి

    రాముడిలా కాదు కర్ణుడిలా ఉన్నాడు: ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ లుక్ పై సీరియల్ నటి కామెంట్స్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jun 09, 2023
    05:32 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆదిపురుష్ టీజర్ రిలీజైనప్పుడు ప్రభాస్ లుక్ పై అనేక విమర్శలు వచ్చాయి. రాముడికి మీసాలు ఉండటమేమిటని ఎంతోమంది అన్నారు.

    టీజర్ లో కనిపించిన గ్రాఫిక్స్ సరిగా లేకపోవడం కూడా ఇలాంటి విమర్శలను మరింత పెంచింది. ఇటీవల రిలీజైన ట్రైలర్లు నెగెటివిటీని పోగొట్టేసి పాజిటివిటీని, అంచనాలను పెంచేసాయి.

    అయినా కూడా ప్రభాస్ లుక్ పై విమర్శలు వస్తున్నాయి. తాజాగా ప్రముఖ నటి కస్తూరి, ఆదిపురుష్ లో ప్రభాస్ లుక్ పై విమర్శలు చేసారు.

    రాముడికి మీసాలతో చూపించడం వల్ల కర్ణుడిలా ప్రభాస్ కనిపిస్తున్నారని ఆమె అన్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు రాముడి పాత్రలో కనిపించారనీ, ప్రభాస్ మాత్రం మీసాల కారణంగా కర్ణుడిలా కనిపిస్తున్నారని అన్నారు.

    Details

    మండిపడుతున్న ప్రభాస్ అభిమానులు 

    కసూరి వ్యాఖ్యలపై ప్రభాస్ అభిమానులు విరుచుకుపడుతునారు. మరికొందరేమో కస్తూరి చెప్పింది కరెక్టేనని ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. రిలీజ్ కు దగ్గర పడుతున్న సమయంలో ఇలాంటి విమర్శలు రావడం అభిమానులను కలవర పెడుతోంది.

    అదలా ఉంచితే, ఆదిపురుష్ చిత్ర అనుభూతిని అందరూ ఆస్వాదించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రాంతంలో ఆదిపురుష్ రిలీజ్ లో భాగస్వామ్యం తీసుకున్న అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థ అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకుంది.

    ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, అనాథ శరణాలయలు, వృద్ధాశ్రమాల్లో ఉండే వారికి ఉచితంగా పదివేల టికెట్లను ఇస్తామని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ప్రకటించింది.

    ఇదే కోవలో రామ్ చరణ్,బాలీవుడ్ నటుడు రణ్ బీర్ కపూర్ కూడా పదివేల టికెట్లను ఫ్రీగా ఇచ్చేందుకు రెడీ అవుతున్నారని టాక్.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆదిపురుష్
    ప్రభాస్

    తాజా

    Sharmishta Panoli: 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని అరెస్ట్‌.. విడుదల చేయాలంటూ ప్రధాని మోదీని కోరిన డచ్ ఎంపీ ఆపరేషన్‌ సిందూర్‌
    Upcoming IPOs: స్టాక్ మార్కెట్లో లిస్టింగ్‌ల జోరు.. ఒకే ఒక్క కంపెనీకి సబ్‌స్క్రిప్షన్ అవకాశం స్టాక్ మార్కెట్
    NIA: పాక్‌ గూఢచర్య నెట్‌వర్క్‌పై ఎన్‌ఐఏ ఉక్కుపాదం.. దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు ఎన్ఐఏ
    Commercial LPG: ఏప్రిల్, మే తర్వాత మరోసారి తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర గ్యాస్

    ఆదిపురుష్

    ఆదిపురుష్ లో అసలు ఫైట్, బయటకు వచ్చిన తాజా అప్డేట్  తెలుగు సినిమా
    ఆదిపురుష్: న్యూయార్క్ లోని ట్రిబెకా ఫెస్టివల్ ప్రీమియర్ కోసం రెడీ  తెలుగు సినిమా
    ఆదిపురుష్: విమర్శలను సీరియస్ గా తీసుకున్నాం అంటున్న నిర్మాత  ప్రభాస్
    ప్రభాస్ అభిమానులకు క్రేజీ అప్డేట్: ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్? తెలుగు సినిమా

    ప్రభాస్

    వచ్చే సంక్రాంతికి ప్రభాస్, రజనీ కాంత్ పోటాపోటీ? తెలుగు సినిమా
    శ్రీరామ నవమి కానుకాగా ఆదిపురుష్ పోస్టర్ రిలీజ్: ట్రోల్స్ కి చెక్ పెట్టేసినట్టే సినిమా
    సలార్ సినిమాకు జేమ్స్ బాండ్ ఫీల్స్ తెలుగు సినిమా
    పదిరోజుల పాటు హైదరాబాద్ లోనే ప్రభాస్: ఈసారి మారుతికి ఛాన్స్ సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025