
Shah Rukh Khan: కింగ్' సినిమా సెట్లో షారుఖ్‌కు గాయం.. చికిత్స కోసం అమెరికా వెళ్లిన బాద్‌షా!
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ గాయపడినట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం 'కింగ్' షూటింగ్ సందర్భంగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని బాలీవుడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ముంబైలోని గోల్డెన్ టొబాకో స్టూడియోలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుండగా, భారీ యాక్షన్ సన్నివేశాల కోసం వేసిన ప్రత్యేక సెట్‌లో షారుఖ్ గాయపడ్డారని సమాచారం. అయితే ఈ గాయానికి సంబంధించి అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. కానీ షారుఖ్ అత్యవసర వైద్య చికిత్స కోసం తన టీమ్‌తో కలిసి అమెరికాకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన కండరాలకు తీవ్రమైన గాయం అయినట్టు సమాచారం. ఇదివరకూ కూడా షారుఖ్‌కు కండరాల సమస్యలు ఉండటంతో అప్పట్లోనే చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే.
Details
త్వరగా కోలుకోవాలి
ఇప్పటికే 2023లో 'పఠాన్', 'జవాన్', 'డంకీ' సినిమాలతో భారీ హిట్‌లు సాధించిన షారుఖ్.. 2024లో సినిమాలకు కొంత విరామం ఇచ్చారు. తాజాగా 'కింగ్' అనే కొత్త సినిమాతో తిరిగి బిజీ అయ్యారు. సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరిద్దరూ కలిసి 'పఠాన్'తో సూపర్ హిట్ అందుకున్నారు. ఇక 'కింగ్' సినిమాలో షారుఖ్ కుమార్తె సుహానా ఖాన్ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. దీపికా పదుకొణె, రాణి ముఖర్జీ, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్ లాంటి ప్రముఖులు కూడా ఇందులో కీలక పాత్రలు పోషించనున్నారు. అభిమానులు షారుఖ్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ.. ఆయన త్వరగా కోలుకుంటారని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి.