Thalapathy Vijay : షారుఖ్ ఖాన్‌నే నా రోల్ మోడల్.. దళపతి విజయ్ కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తనకు రోల్ మోడల్‌లాంటి వ్యక్తి అని తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత దళపతి విజయ్ పేర్కొన్నారు. చెన్నై వేదికగా నిర్వహించిన ప్రత్యేక మీడియా సమావేశంలో విజయ్ తన రాజకీయ ప్రస్థానం, 'జన నాయగన్' సినిమా విడుదలకు సంబంధించిన వివాదాలు, అలాగే తన ఆదర్శ వ్యక్తి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా షారుఖ్ ఖాన్‌పై విజయ్ ప్రశంసల జల్లు కురిపించారు. షారుఖ్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పిన ఆయన.. ఆయన మాట్లాడే తీరు, వ్యక్తిత్వం తనను బాగా ప్రభావితం చేశాయని తెలిపారు.
Details
విజయ్ కెరీర్‌లో 69వ సినిమా
అందుకే షారుఖ్ ఖాన్‌ను తన రోల్ మోడల్‌గా భావిస్తానని స్పష్టం చేశారు. గతంలో 'జవాన్' సినిమా షూటింగ్ సమయంలో షారుఖ్ ఖాన్‌తో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో ఎంతటి సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా గుర్తు చేశారు. ఇక హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'జన నాయగన్' చిత్రం విజయ్ కెరీర్‌లో 69వ సినిమా కావడం విశేషం. అంతేకాదు రాజకీయాల్లో పూర్తిస్థాయిలో అడుగుపెట్టే ముందు ఇది విజయ్ నటిస్తున్న చివరి సినిమా కావడం అభిమానుల్లో మరింత ఆసక్తిని రేపుతోంది.
Details
సంగీతం అందిస్తున్న అనిరుధ్
అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, ప్రకాష్ రాజ్ వంటి ప్రముఖ తారాగణం నటిస్తోంది. ఈ చిత్రం 2023లో విడుదలైన తెలుగు హిట్ మూవీ 'భగవంత్ కేసరి'కి రీమేక్ అని సమాచారం. ఇందులో విజయ్ 'దళపతి వెట్రి కొండన్' అనే శక్తివంతమైన ఐపీఎస్ అధికారి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో వెళ్లే ముందు వస్తున్న ఈ చివరి సినిమాపై అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.