
ఓటీటీలోకి వచ్చేస్తోన్న సమంత శాకుంతలం, స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఈ వార్తాకథనం ఏంటి
శాకుంతలం సినిమాతో తన కెరీర్లో అతిపెద్ద అపజయాన్ని తన ఖాతాలో వేసుకుంది సమంత. 60కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాకు 20కోట్ల వరకు మాత్రమే వసూళ్ళు వచ్చాయి.
సమంత కెరీర్ లో మొదటి పాన్ ఇండియా సినిమాగా రూపొందిన చిత్రం, పాన్ ఇండియా లెవెల్లో మొదటి ఫ్లాపును అందించింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రేక్షకులను పలకరించనుంది. సినిమా రిలీజ్ కు ముందే, డిజిటల్ డీల్స్ జరిగిపోవడంతో, సినిమా రిలీజైన 28రోజులకే డిజిటల్ లోకి వస్తోంది.
మే 12వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ లో శాకుంతలం స్ట్రీమింగ్ అవుతుందని అంటున్నారు.
Details
5భాషల్లో ఒకేసారి విడుదల
నిజానికి నిర్మాత దిల్ రాజు, 5-8వారాలు పూర్తయ్యే వరకు డిజిటల్ లో రిలీజ్ చేయకూడదని అనుకున్నాడట. కానీ సినిమా ఫలితం తేడాగా రావడంతో 28రోజుల్లోనే రిలీజ్ అవుతోంది.
తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది. సుమారు 20కోట్లు పెట్టి శాకుంతలం డిజిటల్ హక్కులను అమెజాన్ దక్కించుకుందని అంటున్నారు.
శాకుంతలం సినిమా వైఫల్యానికి కారణాలు: కాళిదాసు రచించిన కావ్యాన్ని వెండితెర మీదకు తీసుకురావడంలో గుణశేఖర్ ఫెయిల్ అయ్యారు.
నెమ్మదిగా సాగే కథనం, నాణ్యత లేని గ్రాఫిక్స్, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ సరిగ్గా కుదరకపోవడం వంటి కారణాలు శాకుంతలం ఫ్లాప్ కావడానికి కారణాలని సోషల్ మీడియాలో కామెంట్లు వచ్చాయి.