శాకుంతలం సినిమా ఫలితం: సంబంధం లేదంటూ పరోక్షంగా తెలియజేసిన సమంత
ఈ వార్తాకథనం ఏంటి
మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం కావ్యాన్ని దర్శకుడు గుణశేఖర్ వెండితెర మీదకు శాకుంతలం పేరుతో తీసుకొచ్చాడు.
ఇందులో శకుంతల గా స్టార్ హీరోయిన్ సమంత నటించింది. ఏప్రిల్ 14వ తేదీన థియేటర్లలోకి వచ్చిన శాకుంతలం, రెండవ రోజుకి చతికిలబడిపోయింది.
వెండితెర మీద శకుంతల, దుష్యంతుడు మధ్య ప్రేమ కథ సరిగ్గా పండలేదని శాకుంతలం సినిమాకు నెగటివ్ రివ్యూలు వచ్చాయి.
సమంత కెరీర్ లో పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకు ఇంత దారుణంగా రివ్యూలు రావడం పై సర్వత్రా చర్చ నడుస్తోంది. తాజాగా తన ఇన్స్ టా అకౌంట్ లో ఒక పోస్ట్ పెట్టింది సమంత.
Details
భగవద్గీత శ్లోకాన్ని పోస్ట్ చేసిన సమంత
భగవద్గీతలోని కర్మణ్యే వాధికారస్తే అనే శ్లోకాన్ని పోస్టుగా పెట్టింది సమంత. ప్రస్తుతం ఇంటర్నెట్లో ఈ పోస్టు వైరల్ గా మారుతోంది.
కర్మణ్యే శ్లోకం అర్థం ఏమిటంటే:
పనిచేయడం మన చేతిలో ఉంటుంది, దాన్ని ఫలితం మన చేతుల్లో ఉండదు అని. అందరికీ నచ్చుతుందని ఉద్దేశంతో సినిమా తీశాను కానీ సినిమా ఫలితం మా చేతుల్లో ఉండదనే అర్థం వచ్చేలా సమంత పోస్ట్ పెట్టిందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.
శాకుంతలం సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎందుకు నిరాశపరిచిందంటే:
శాకుంతల సినిమాలో కథనం నెమ్మదిగా సాగిందని రివ్యూలు వచ్చాయి ముఖ్యంగా, సమంత సొంత డబ్బింగ్ సినిమాకు మైనస్ అయ్యిందని అన్నారు. ఇంకా దేవ్ మోహన్ నటన అంతగా ఆకట్టుకోలేదని కామెంట్లు వచ్చాయి.